Ramgopal Varma : జాతీయ రాజకీయాల్లోకి కేసీయార్.! ‘ఆదిపురుష్’కి వెల్‌కమ్ చెప్పిన ఆర్జీవీ.!

NQ Staff - October 5, 2022 / 10:17 PM IST

Ramgopal Varma : జాతీయ రాజకీయాల్లోకి కేసీయార్.! ‘ఆదిపురుష్’కి వెల్‌కమ్ చెప్పిన ఆర్జీవీ.!

Ramgopal Varma : ఆర్జీవీ అంటేనే వెటకారం.! నిజాలు మాట్లాడాలని ఆయన అనుకున్నా, అది వెటకారం అయి కూర్చుంటుంది. అంతలా విశ్వసనీయతను కోల్పోయాడు ఒకప్పటి సంచలన దర్శకుడు, ప్రస్తుత వివాదాల ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ.

రాజకీయాలు నాకు సరిపడవు.. అంటాడాయన. కానీ, రాజకీయాల్లో వేలెడుతుంటాడు. కేసీయార్ అంటే ఆర్జీవీకి వల్లమాలిన అభిమానం. దీన్ని భయం అని కూడా అనుకోవచ్చు. కేసీయార్‌ని పొగిడే క్రమంలో ఆర్జీవీ ఒళ్ళు మర్చిపోతుంటాడు.

కేసీయార్‌ని ఆదిపురుష్‌తో పోల్చిన ఆర్జీవీ..

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చడం ద్వారా కేసీయార్ ఆదిపురుష్ (ఫస్ట్ మ్యాన్) అయ్యారంటూ ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా పంచ్ డైలాగ్ పేల్చాడు.

అంతే కాదు, ‘జాతీయ రాజకీయాల్లోకి స్వాగతం’ అంటూ ట్వీటేశాడు ఆర్జీవీ. అసలు ఆర్జీవీ ఎవడు, కేసీయార్‌ని జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి.? అంటూ నెటిజనం ప్రశ్నిస్తున్నారు.
లేని చోట స్పేస్ క్రియేట్ చేసుకుని, ‘నన్ను కూడా పట్టించుకోండి..’ అని వెకిలి వేషాలు వేయడంలో ఆర్జీవీ దిట్ట. ఇక్కడ ఆర్జీవీ చేసింది కూడా అదే.!

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us