Anchor Suma : సుమ ఇక ఆ రంగానికి ఫుల్‌స్టాప్ పెట్టేసినట్టేనా?
NQ Staff - June 19, 2022 / 09:00 AM IST

Anchor Suma : బుల్లితెర మహారాణి ఎవరంటే తడుముకోకుండా సుమ అని ఠక్కున చెప్పేయోచ్చు. ఎలాంటి షో చేసినా కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటూ మంచి రేటింగ్స్ అందించగల సుమ అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా అని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఆమె ఒక విషయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది విని ఆమె అభిమానులు ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

Anchor Suma don’t want to do movies
షాకింగ్ న్యూస్..
మొదట టెలివిజన్ రంగంలో నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన సుమ ఆ తర్వాత సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తెలుగు చాలా బాగా నేర్చుకుని మంచి యాంకర్ గా స్థిరపడిపోయింది మొదట్లోనే హీరోయిన్ గా కూడా ఒక సినిమా చేసింది కానీ అదేమీ అంతగా సక్సెస్ కాలేదు.
యాంకర్ సుమ మొదట అనుకోకుండా ఒక కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించి ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆడియో ఈవెంట్ తో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లో యాంకర్ సుమ మంచి హోస్ట్ గా కొనసాగుతూ ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యాంకర్ గా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంది.
చాలా కాలం తర్వాత యాంకర్ సుమ వెండితెరపైకి సరికొత్త గారి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె జయమ్మ పంచాయతీ అనే ఒక సినిమాలో నటించారు. ఆ సినిమాకు విడుదలకు ముందు చాలా బాగా బజ్ క్రియేట్ చేయడంతో సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని కూడా సుమ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. అయితే ఆ సినిమా థియేట్రికల్ గా నాలుగున్నర కోట్ల వరకు బిజినెస్ చేయగా సగానికి పైగా నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది.
పెట్టిన పెట్టుబడికి దాదాపు రెండు కోట్ల వరకు నష్టాలు రావడంతో యాంకర్ సుమ ఆ విషయంలో తీవ్రంగా అప్సెట్ అయినట్లు కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. కొంతమంది చిన్న నిర్మాతలు ఆమెకు భారీగా మంచి పారితోషికం కూడా ఇస్తామని కొన్ని ప్రాజెక్టులను ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే జయమ్మ పంచాయతీ తీవ్రంగా నష్టాలకు గురి చేయడంతో ఆమె ఇప్పుడు అలాంటి ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. కొంత కాలం పాటు వెండితెరకు దూరంగానే ఉండాలని సుమ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.