Anasuya : వెల్‌కమ్ ఆంటీ: విజయవాడ వెళ్ళిన అనసూయకి ర్యాగింగ్ తప్పలేదే.!
NQ Staff - September 3, 2022 / 06:39 PM IST
Anasuya : బుల్లితెర బ్యూటీ, వెండితెర రంగమ్మత్త అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేయడమే కాదు, తరచూ వివాదాలతో హాట్ టాపిక్ అవుతుంటుంది కూడా. అంతేనా, ఫ్యామిలీకి కూడా తగినంత సమయం కేటాయిస్తుంటుంది.
పర్సనల్ లైఫ్ వేరు.. యాక్టింగ్ లైఫ్ వేరు.. అని చెబుతుంటుంది అనసూయ. ‘అవును, నాకు పెళ్ళయ్యింది.. నేను ఇద్దరబ్బాయిలకి తల్లిని కూడా..’ అని చెప్పడమే కాదు, కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకీ, గుళ్ళూ గోపురాలకీ తిరుగుతూ ఆ ఫొటోల్ని కూడా షేర్ చేస్తుంటుంది సోషల్ మీడియాలో.
బెజవాడకు వెళ్ళిన అనసూయ..
తాజాగా అనసూయ బెజవాడకు వెళ్ళింది. దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి విజయవాడకు కారులో వెళ్ళిన అనసూయ, ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంకేముంది, షరామామూలుగానే ‘ఆంటీ’ అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు. ‘అనసూయ ఆంటీ.. వెల్‌కమ్ టు విజయవాడ..’ అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. తనను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడమే కాదు, ఆల్రెడీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది కూడా. కానీ, అనసూయని ‘ఆంటీ’ అంటూ ట్రోలింగ్ చేయడం మానడంలేదు.