Anasuya : అనసూయ ‘ఉసురు’ డైలాగ్ ‘లైగర్’ సినిమా మీద కాదా.?
NQ Staff - August 29, 2022 / 10:21 PM IST

Anasuya : ‘ఉద్దేశ్యాల’ గురించి మాట్లాడుతున్న మీరు.. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ‘లైగర్’ సినిమా ఫెయిల్యూర్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనసూయగారూ.? అంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా, నటి అలాగే యాంకర్ అయిన అనసూయ భరద్వాజ్‌ని ప్రశ్నించాడు.

Anasuya Usuru dialogue is not on the movie Liger
‘లైగర్’ సినిమా విడుదల రోజునే, ‘ఉసురు తగిలింది..’ అంటూ అనసూయ సంచలనాత్మక ట్వీట్ వేసిన విషయం విదితమే. అక్కడితో, ఆమెపై పెద్దయెత్తున ట్రోలింగ్ షురూ అయ్యింది. ఈ క్రమంలో ఆమె తనను సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో టార్గెట్ చేసినవారిపై సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన విషయం విదితమే.
ఈ ప్రశ్నకు బదులేది.?
తాజాగా, పైన పేర్కొన్న విధంగా ఓ నెటిజన్ ప్రశ్నించేసరికి అనసూయ డిఫెన్స్‌లో పడిపోయినట్టుంది.! ‘నేను ఏ సినిమా లేదా ఏ నటుడి గురించీ నేనేమీ చెప్పలేదు. ఎవర్నీ దూషించలేదు. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను చెప్పాను. ఎవరి పేరూ ప్రస్తావించలేదు. నా అభిప్రాయాన్ని నేను చెప్పడానికి నాకు హక్కు వుంది.. అది ఇంతరుల్ని కించపర్చనంతవరకూ అభ్యంతరకరం కాదు. కానీ, నన్ను దూషిస్తున్నవారి పద్ధతి వేరు.. నేరుగా దాడి చేస్తున్నారు, దూషిస్తున్నారు.. టార్గెట్ చేసి వేధిస్తున్నారు..’ అంటూ అనసూయ సమాధానమిచ్చింది సదరు ట్వీటుకి.
అంటే, పేరు పెట్టకుండా వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో ఎలాగైనా మాట్లాడేయొచ్చన్నమాట.! ఓ సినిమాని నాశనం చెసెయ్యడానికి కంకణం కట్టుకోవచ్చన్నమాట.. అంటూ నెటిజన్లు అనసూయని ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదం ఇక్కడితో ఆగేలా లేదు. పోలీసులకు ఫిర్యాదు చేశానని అనసూయ ప్రకటించాక కూడా, ట్రోలింగ్ కొనసాగుతూనే వుంది.