Anasuya : అన‌సూయ ఇలా ట్విస్ట్ ఇచ్చేసింది ఏంటి.. జ‌బ‌ర్ధ‌స్త్‌కి గుడ్ బై చెప్పిందా?

NQ Staff - June 30, 2022 / 08:46 AM IST

Anasuya : అన‌సూయ ఇలా ట్విస్ట్ ఇచ్చేసింది ఏంటి.. జ‌బ‌ర్ధ‌స్త్‌కి గుడ్ బై చెప్పిందా?

Anasuya : అన‌సూయ అంటే జ‌బ‌ర్ధ‌స్త్‌. జ‌బ‌ర్ధ‌స్త్ అంటే అన‌సూయ అనేలా ఉండేది. ఈ అమ్మ‌డు జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతోనే లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. ఈ షోలో అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. జబర్దస్త్ యాంకర్ గా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. మధ్యలో కూడా ఆమెకు ఏదైనా అవసరమై కొన్ని రోజులు తప్పుకుంటే రశ్మితో మేనేజ్ చేశారు.

Anasuya out from Jabardasth

Anasuya out from Jabardasth

పోస్ట్ మ‌ర్మం ఏంటి?

ప్ర‌స్తుతం జ‌బర్ధ‌స్త్‌లో తెగ సంద‌డి చేస్తున్న అన‌సూయ ఈ షో నుంచి అనసూయ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అనసూయ పరోక్షంగా కామెంట్స్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.‘నా కెరీర్‌లో నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చాలా మొమోరీస్‌ని తీసుకెళ్తున్నాను. అందులో ఎన్నో మధురక్షణాలతో పాటు.. కొన్ని చేదు క్షణాలు.. కూడా ఉన్నాయి. మున్ముందు కూడా ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను’అని అనసూయ రాసుకొచ్చింది.

జబర్దస్త్ నుంచి విడిచి వెళ్ళుతుండడంతో అనసూయ ఈ కామెంట్స్ పోస్ట్ చేసిందని అంటున్నారు. ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే..ఇటీవలే పుష్ప సినిమాలో దాక్షాయణిగా మెప్పించింది. ప్రస్తుతం ఆమె నటించిన అరి, రంగమార్తండ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

యాంక‌ర్‌గా కొన‌సాగుతున్న స‌మ‌యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఆఫ‌ర్ అన‌సూయ‌కి వ‌చ్చింది. ఇందులో రంగమ్మత్త అనే పాత్రతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రతో మరింత క్రేజ్ సంపాదించింది. అనసూయను దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకునే దర్శకుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.

ఇప్పటికే ఆమె చేస్తున్న సినిమాలు, చేసిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే జ‌బ‌ర్ధ‌స్త్ షో నుండి వెంటవెంటనే ఒక్కొక్కరిగా స్టార్‌లంతా బయటకు వస్తున్నారు. హైపర్ ఆది కనిపించగా నెలలు గడుస్తోంది. సుధీర్ అయితే ఏకంగా మల్లెమాలకు దూరంగా వెళ్లిపోయాడు. స్టార్ మాలో సెటిల్ అయ్యాడు. ఇక ఆది కేవలం శ్రీదేవీ డ్రామా కంపెనీలోనే కనిపిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క‌ళ్లుగా జ‌బ‌ర్ధ‌స్త్‌కి దూరం అవుతుండ‌డం చూస్తుంటే మ‌ల్లెమాల‌లో ఏదో జ‌రుగుతుంద‌నే అనుమానాలు అభిమానుల‌లో త‌లెత్తుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us