Anasuya Bharadwaj : వైరల్‌.. రెండవ పెళ్లి గురించి ఆలోచిస్తున్న అనసూయ

NQ Staff - October 7, 2022 / 01:38 PM IST

Anasuya Bharadwaj  : వైరల్‌.. రెండవ పెళ్లి గురించి ఆలోచిస్తున్న అనసూయ

Anasuya Bharadwaj  : జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ప్రతి ఒక్కరి కామెంట్ కి రెస్పాండ్ అవుతూనే ఉంటుంది. తనను బ్యాడ్ గా కామెంట్ చేస్తే సీరియస్ గా రియాక్ట్ అవుతుంది, తన అందాన్ని పొగిడితే ఆనందిస్తుంది.

అలాగే తన గురించి ఏమైనా సలహాలిస్తే తప్పకుండా పాటిస్తానంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి చేరువైన అనసూయ రెగ్యులర్ గా తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది.

ఇటీవల ఒక అభిమాని అనసూయ చిట్ చాట్ సందర్భంగా.. నేను మిమ్మల్ని చాలా సార్లు పెళ్లి చేసుకుందామని అడిగాను, కానీ మీ నుండి ఎలాంటి సమాధానం రావడం లేదు అంటూ కాస్త సీరియస్ గానే అనసూయకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.

నార్మల్ గా ఎవరైనా ఇలాంటి కామెంట్స్ ని ఇగ్నోర్ చేస్తారు.. కానీ అనసూయ మాత్రం ఫన్నీగా స్పందించింది. అతడి యొక్క అభిమానంను అర్థం చేసుకున్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. మీ యొక్క పెళ్లి ప్రపోజల్ ని గురించి ఆలోచిస్తున్నాను అన్నట్లుగా ఈ మోజీ షేర్ చేసింది.

తన యొక్క ఆలోచిస్తున్న ఫోటోను షేర్ చేసింది, అంతే కాకుండా లవ్ ఇమేజ్ ని షేర్ చేయడంతో అతడు ఫిదా అయి ఉంటాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది.

అనసూయకు పెళ్లయి ఇద్దరు కొడుకులను విషయం తెలిసిందే, అయినా కూడా ఆమెని ఇప్పటికి పెళ్లి చేసుకోవాలనుకుని చాలా మంది కోరుకుంటున్నారు అంటే ఆమెని ఎంతగా అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us