Anasuya Bharadwaj Praised Trailer Of Baby Movie : విజయ్ దేవరకొండ మెప్పుకోసం ప్రయత్నిస్తున్న అనసూయ.. తమ్ముడిపై ప్రశంసలు..!
NQ Staff - July 11, 2023 / 10:28 AM IST

Anasuya Bharadwaj Praised Trailer Of Baby Movie :
చాలా కాలంగా యాంకర్ అనసూయ, స్టార్ హీరో విజయ్ దేవరకొండ నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. చాలా కాలంగా విజయ్ ను అనసూయ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ వస్తోంది. దాంతో విజయ్ ఫ్యాన్స్ కూడా అనసూయపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దానిపై ఆమె ఏకంగా పోలీస్ కేసులు కూడా పెట్టేసింది.
ఇలా చాలా కాలంగా జరుగుతున్న వివాదాన్ని మొన్న ఆమె పులిస్టాప్ పెట్టేసింది. తనకు ఇక నుంచి ఎలాంటి వివాదాలు వద్దని.. ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. దాంతో అప్పటి నుంచే విజయ్ ఫ్యాన్స్ కూడా కాస్త కూల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె మళ్లీ విజయ్ మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Anasuya Bharadwaj Praised Trailer Of Baby Movie
ఆ ట్రైలర్ మీద కామెంట్లు..
ఇందులో భాగంగా ఆమె తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటిస్తున్న బేబీ మూవీ మీద ప్రశంసలు కురిపించింది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ మీద అనసూయ ట్వీట్ చేసింది. కాస్త లేటుగా స్పందించాను. కానీ ట్రైలర్ చూశాను. చాలా బాగుంది.
ఇది కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు కలిగింది. మూవీ టీమ్ కు కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. ఇలా విజయ్ ఫ్యామిలీకి ఆమె మళ్లీ దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతోంది.

Anasuya Bharadwaj Praised Trailer Of Baby Movie
ఏదేమైనా అనసూయ చేసింది ఒక రకంగా మంచి పనే అంటూ కామెంట్లు పెడుతున్నారు విజయ్ ఫ్యాన్స్.