Anasuya Bharadwaj : ముక్కుకి ముక్కెర పెట్టి అందాల‌తో మ‌తులు పోగొడుతున్న అన‌సూయ‌

Anasuya Bharadwaj : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ న‌టిగా, యాంక‌ర్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతుంది.రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాంకర్‌ అనసూయ .. బడా సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో నటించి మరోసారి మెప్పించింది. ‘దాక్షాయని’ పాత్రలో మంగళం శ్రీను భార్యగా కనిపించింది. ఇందులో నిడివి త‌క్కువ ఉన్న పాత్ర‌లో న‌టించి మెప్పించింది.

Anasuya Bharadwaj cute saree photos
Anasuya Bharadwaj cute saree photos

పుష్ప ఫస్ట్‌ పార్ట్‌లో అనసూయ రోల్‌ తక్కువగానే ఉన్నా సెకండ్‌ పార్ట్‌లో మాత్రం అనసూయ రోల్‌ కీలకంగా మారనుందని తెలుస్తుంది. ఫాహద్‌ ఫాజిల్‌తో కలిసి బన్నీపై పగ తీర్చుకునేలా అనసూయ క్యారెక్టర్‌ ఉండనుందని సమాచారం. అయితే ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ప‌లు టీవీ షోస్‌తో బిజీగా ఉంది.

Anasuya Bharadwaj cute saree photos
Anasuya Bharadwaj cute saree photos

తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర‌క‌ట్టులో ముక్కుకి ముక్కెర పెట్టుకొని స్టైలిష్ లుక్ లో మెరిసింది. అన‌సూయ గ్లామర్ చూసి నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చీర‌క‌ట్టులో ఈవిడ అందం మ‌రింత రెట్టింపు అయింద‌ని ప‌లువురు కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం అన‌సూయ గ్లామ‌ర్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Anasuya Bharadwaj cute saree photos
Anasuya Bharadwaj cute saree photos

అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు.

Anasuya Bharadwaj cute saree photos
Anasuya Bharadwaj cute saree photos

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రంలో అన‌సూయ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Anasuya Bharadwaj cute saree photos
Anasuya Bharadwaj cute saree photos
Anasuya Bharadwaj cute saree photos
Anasuya Bharadwaj cute saree photos
Anasuya Bharadwaj cute saree photos
Anasuya Bharadwaj cute saree photos