Anasuya : అనసూయ ‘వేడి’ చల్లారినట్టేనా.? వాళ్ళు మాత్రం ‘తగ్గేదే లే’దంటున్నారు.!
NQ Staff - August 28, 2022 / 04:31 PM IST

Anasuya : ఎట్టకేలకు అనసూయ నుంచి ట్వీట్లోత్పాతం కాస్త తగ్గింది. బ్యాక్ టు బ్యాక్ రెండ్రోజులపాటు సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ హంగామా నడిచింది. ‘లైగర్’ సినిమాకి ‘ఉసురు’ తగిలిందంటూ చేసిన ట్వీట్ దగ్గర్నుంచి, ఆమె మీద ట్రోలింగ్ జరగడం, ఆ ట్రోలింగ్‌పై ‘పోలీస్ కేసు పెడతా’ అంటూ ఆమె బెదిరించడం తెలిసిన సంగతే.!

Anasuya and Tollywood twitter war
ఈ క్రమంలోనే ‘ఆంటీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని కొందరు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. సుమారు లక్ష వరకు ట్వీట్లు పడ్డాయ్ ఈ హ్యాష్‌ట్యాగ్‌తో. మరోపక్క, వేల సంఖ్యలో మీమ్స్ దర్శనమిచ్చాయి. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో అనసూయని ట్రోల్ చేశారు.
కేసులు పెడతానని హెచ్చరించినాగానీ..
తన మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. అలా తనను బూతులు తిడుతున్నవారికి ట్విట్టర్ వేదికగా సమాధానాలు చెబుతూనే, వాటి స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నట్లు పేర్కొంది. కానీ, అనసూయ మీద ట్రోలింగ్ తగ్గలేదు.
ఎట్టకేలకు రెండ్రోజుల తర్వాత కాస్త వేడి తగ్గింది. అయినాగానీ, ఒకటీ అరా ట్వీట్లు పడుతూనే వున్నాయి. ఇంతకీ, అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసిందా.? లేదా.? కేసులు నమోదయ్యాయా.? లేదా.? అరెస్టులు జరుగుతాయా.? లేదా.? వేచి చూడాల్సిందే.