Anasuya : అనసూయ కూడా రష్మీలాగే ఆ తప్పు చేస్తోందా.?
NQ Staff - July 25, 2022 / 07:00 AM IST

Anasuya : అనసూయ కూడా రష్మిలాగే తయారైందా.? అదేంటీ ఏ విషయంలో అనసూయనూ రష్మినీ పోల్చుతున్నారు.. అంటారా.? అనసూయ కన్నా ముందే, రష్మీ గౌతమ్ బుల్లితెర నుంచి, పెద్ద తెరకు ప్రమోట్ అయ్యింది.

Anasuya also doing same misteke as Rashmi Goutam
పెద్ద తెరపై హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోవాలనుకుంది రష్మీ గౌతమ్. ఆ కంగారులో వచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని ఒప్పేసుకుంది. అయితే, చివరికి ఏమైంది. అడల్ట్ హీరోయిన్, హారర్ హీరోయిన్.. ఇలా పనికిమాలిన ట్యాగ్‌లు వేయించుకుని, మొత్తానికి సినిమాలకే దూరమైపోయింది.
ఇప్పుడు అనసూయ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. మొదట్లో అనసూయ సినిమాల్లో చాలా తెలివిగా వ్యవహరించేది. ఆచి తూచి అవకాశాలను ఒప్పుకునేది. అలా అనసూయ నుంచి వచ్చిన మంచి సినిమాలే ‘క్షణం’, ‘రంగస్థలం’. కాస్త కాస్త గ్యాప్ తీసుకుని, ఆలోచించి ఓకే చేసిన ప్రాజెక్టులివి.
అనసూయ అప్పుడలా.. ఇప్పుడిలా
అనసూయకు కంప్లీట్ సక్సెస్ తెచ్చిపెట్టిన ప్రాజెక్టులు కూడా అవి. కానీ, ఇప్పుడు అనసూయ వేరు. క్రేజ్ వుంది కదా.. అని వచ్చిన ప్రతీ అవకాశాన్నీ వాడేసుకోవాలని తాపత్రయపడుతోంది. ఆ తాపత్రయంలోనే తప్పటగుడులు వేసేస్తోంది.
నిజానికి ‘పుష్ప’ సినిమాలో అనసూయ వేసిన క్యారెక్టర్ కూడా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సినిమా హిట్ అయ్యింది కానీ, అనసూయ పాత్ర మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఆ సినిమాలో. ఆ తర్వాత వచ్చిన ‘ఖిలాడీ’ కూడా అంతే.
ఇక ఇప్పుడు ‘దర్జా’తో ‘చీర కట్టిన సివంగిని’ అంటూ లేడీ డాన్ వేషంలో శివాలెత్తింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఇక రానున్న ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా పరిస్థితి కూడా అంతే.
బొత్తిగా కళ లేని సినిమాలా కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే, సినిమాల్లో అనసూయ కెరీర్ మంగళం పాడేయడానికి ఇంకెంతో సమయం పట్టదనిపిస్తోంది. తస్మాత్ జాగ్రత్త రంగమ్మత్తా.!