Ananya Panday : ‘లైగర్’ పోరీ.! సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నావా.. ఏంటీ.?
NQ Staff - August 29, 2022 / 10:18 PM IST

Ananya Panday : బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఇటీవలే ‘లైగర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్రమోషన్లలో తన ఘాటైన అందాలతో కుర్రకారుకు గాలమేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది.

Ananya Panday new cute photo
అందుకు కారణం అనన్యా పాండే సిక్స్ ప్యాక్ పిక్సే. అదేంటీ.! పిసరంత కండే లేని అనన్యా పాండే సిక్స్ ప్యాక్ ట్రై చేయడమేంటీ.? అని ఆశ్చర్యపోతున్నారా.? అవునండీ ఆ పిక్స్ చూస్తే మరి అలాంటి ఒపీనియన్‌కే వస్తారు మరి.
మాస్ విత్ స్టైలిష్..
కానీ, ఇదో స్పెషల్ ఫోటో షూట్. ‘లైగర్’ ప్రమోషన్స్‌లో భాగమే. ఇంతవరకూ అనన్యా ఫోటోలు ఓ ఎత్తు. ఈ ఫోటోలు ఇంకో ఎత్తు. వైబ్స్ చూపిస్తూ స్టైలిష్‌గా ఇచ్చిన అనన్యా ఈ పోజులకు కుర్రకారు గుండెల్లో దేత్తడి పోచమ్మ గుడి.
బ్లూ అండ్ బ్లూ జీన్స్ ప్యాటర్న్ టాప్ అండ్ బాటమ్ ధరించింది. ఇన్నర్‌లో లైన్స్ ప్యాటర్న్ టోటల్ కాస్ట్యూమ్‌నే డామినేట్ చేస్తోంది. ఇక షార్ట్ అండ్ లూజ్ హెయిర్ అనన్యలోని క్యూట్‌నెస్‌ని ఎలివేట్ చేస్తోంది. అందుకే ఈ పిక్స్ అంతలా ట్రెండింగ్ అవుతున్నాయ్.
ఇక ‘లైగర్’ సినిమా విషయానికి వస్తే, సినిమాల్లో అనన్యకు పెద్దగా సీను లేదని తేల్చేశారు. కానీ, రిలీజ్‌కి ముందు ప్రోమోస్‌లో మాత్రం అనన్య మాస్ లుక్స్, ఊర మాస్ స్టెప్స్ కెవ్వు కేకో కేక.