Ananya Panday : ఛీ.. ఛీ.! ఏంటా డ్రస్సు.! లైగర్ బ్యూటీని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజనం.!
NQ Staff - September 29, 2022 / 10:12 PM IST

Ananya Panday : ‘లైగర్’ బ్యూటీ అనన్యా పాండేకి అస్సలు డ్రస్ సెన్స్ లేదని ‘లైగర్’ సినిమా ప్రమోషన్లలోనే తేల్చేశారు సినీ అభిమానులు. ఆ సినిమా ప్రమోషన్ల టైమ్‌లో అనన్య చేసిన గ్లామర్ హంగామాకి చాలా సార్లు నోరెళ్లబెట్టారు అభిమానులు.
అవును మరి, అంత దారుణంగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసింది అనన్యా పాండే. ఇక, సినిమా ఎలాగూ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిందనుకోండి. ఒకవేళ సినిమా హిట్ అయ్యి వుంటే, అనన్యాలోని లోపాలన్నీ సర్దుకుపోయేవి.
ఎంత ఫ్లాప్ వస్తే మాత్రం.. మరీ ఇంతలానా.?
కానీ, సీను రివర్స్ అవ్వడంతో, నెటిజనానికి అనన్య మళ్లీ మళ్లీ టార్గెట్ అవుతూనే వచ్చింది. తాజాగా ఇంకోసారి పాపం.! అనన్యను టార్గెట్ చేసేశారు నెటిజనం. ఛీ చీ దీన్ని డ్రస్ అంటారా.? పిసరంతైనా కండ లేని నువ్వు ఇలాంటి డ్రస్సులు ఎందుకు వేసుకుంటావ్.!
అయినా నువ్వు హీరోయిన్ మెటీరియలే కావు..! అంటూ పాపం అనరాని మాటలతో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి అనన్య పాండే డ్రస్సులో ఛీ ఛీ అనేంత వల్గారిటీ లేదు. లాంగ్ లెహంగా ధరించింది. అల్ర్టా మోడ్రన్‌లో టాప్ ధరించింది. ఓకే బాగానే వుంది కూడా. కానీ, ఎందుకో నెటిజన్లను ఇంప్రెస్ చేయలేకపోయింది అనన్యా పాండే.
అంతే, ఫ్లాప్ వస్తే అలాగే వుంటుందేమో. అదే హిట్ వస్తే, ఎలా వున్నా అందంగానే కనిపిస్తుంది. ‘లైగర్’ ఎంత పని చేసింది అనన్యకు. మరీ ఇంత దారుణమా.? ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్యా పాండే నటించిన సంగతి తెలిసిందే.