Anand Devarakonda : తమ్ముడు దేవరకొండ ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడే
NQ Staff - November 22, 2022 / 09:37 AM IST
Anand Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సక్సెస్ మరియు ఫ్లాప్ అనే విషయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆనంద్ దేవరకొండ త్వరలో బేబీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
కలర్ ఫోటోతో జాతీయ స్థాయి అవార్డుని సొంతం చేసుకున్న సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆనంద్ దేవరకొండకు జోడిగా ఈ సినిమాలో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా యొక్క టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. పీరియాడిక్ డ్రామా.. అది కూడా స్కూల్ లైఫ్ ప్రేమ కథతో ఈ సినిమా రూపొందబోతుందని ఇప్పటికే ఒక క్లారిటీ టీజర్ ద్వారా ఇవ్వడం జరిగింది.
భారీ అంచనాల నడుమ దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా ను విడుదల చేయబోతున్నాడు. తన గత చిత్రం కలర్ ఫోటోకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని టీజర్ తోనే చెప్పకనే చెప్పాడు.
కచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని, ఆనంద్ దేవరకొండకు మొదటి కమర్షియల్ బిగ్ సక్సెస్ ఈ సినిమాతో రాబోతుందని అంతా నమ్ముతున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈమధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవుతున్న కారణంగా అభిమానులు నిరాశలో ఉన్నారు. ఆ నిరాశను ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.