Amrutha Naidu : పండ‌గ పూట విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో న‌టి కూతురు మృతి

Amrutha Naidu : సంక్రాంతి పండుగ స‌మ‌యంలో క‌న్న‌డ న‌టి ఇంట విషాదం నెల‌కొంది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. బెంగుళూరులో గురువారం రాత్రి ఆమె తన 6 ఏళ్ల కూతురు సమన్వితో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా పెద్ద లారీ ఆమె బండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సమన్వి అక్కడిక్కడే మృతిచెందగా.. అమృతకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Amrutha Naidu car accident
Amrutha Naidu car accident

అమృత ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని అంటున్నారు వైద్యులు. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే.. అమృత నాలుగు నెలల గర్భవతి. ఈ రోడ్డు ప్రమాదంలో ఆమె తన గర్భాన్ని కూడా పోగొట్టుకున్నారు.సీరియల్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అమృతా నాయుడు పలు టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించగా కూతురు సమన్వి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.

నానమ్మ సూపర్ స్టార్ రియాలిటీ షో లో సమన్వి పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. భవిష్యత్తులో ఆమె గొప్ప నటి అవుతుందని అందరు భావించారు. అనూహ్యంగా హఠాత్మరణంతో చిన్నారి సమన్వి ప్రాణాలు విడవడం బాధాకరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ విషాద ఘటన కన్నడ పరిశ్రమను విషాదంలో కి నెట్టింది.

కొద్ది నెలల క్రితం హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పునీత్ అకాల మరణం కన్నడ ప్రజలను భారీ కుదుపుకు గురిచేసింది. ఆయన మరణం మరవక ముందే చైల్డ్ ఆర్టిస్ట్ సమన్వి కన్నుమూశారు. కనీసం అమృత కోలుకుని తిరిగి రావాలని అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు కోరుకుంటున్నారు.