Amritha Aiyer : అద్దంలో అందగత్తె.! అందం ‘అమృత’మే.!
NQ Staff - December 21, 2022 / 07:13 PM IST

Amritha Aiyer : ‘నీలీ నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ వున్నా..’ అంటూ యాంకర్ ప్రదీప్తో పొగిడి పొగిడి మరీ పాటేయించుకున్న ముద్దుగుమ్మ అమృతా అయ్యర్.
అదేనండీ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ అమృత అయ్యర్. ఇటీవల ‘కాఫీ విత్ కాదల్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది.
కొంచెం కారంగా, కొంచెం గారంగా..
సినిమాల్లో పెద్దగా సీను లేకున్నా, అమ్మడికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ వుంది. అంత ఫాలోయింగ్ అమృతకి ఎలా వచ్చిందా.? అని ఆశ్చర్యపోయేంతలా అన్నమాట.
అందుకే సినిమా ఛాన్సుల సంగతెలా వున్నా, నెట్టింటి పాలోయింగ్ని మాత్రం తెగ వాడేసుకుంటుంది అమృతా అయ్యర్.
కొంచెం కారంగా, కొంచెం గారంగా అనేలా ఫోటో షూట్లు చేయించుకుంటుంది. ఆ ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేసి కుర్రకారును మురిపిస్తుంది. తాజాగా ఎల్లో కలర్ గాగ్రా చోళీలో అమృతా అయ్యర్ చేస్తున్న నడుమందాల హాట్ షోకి నెటిజనం ఫిదా అవుతున్నారు.
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అంటూ ఊహా లోకాల్లో విహరిస్తున్నారు. సన్నని క్లీవేజ్ షోతో అద్దంలో మురిసిపోతూ పోజిచ్చి మురిపిస్తోంది అమృతా అయ్యర్.