Amitabh Bachchan : మళ్లీ కరోనా బారిన పడ్డ అమితాబ్ బచ్చన్.. ఆందోళన చెందుతున్న అభిమానులు
NQ Staff - August 24, 2022 / 08:49 AM IST

Amitabh Bachchan : దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా పెరుగుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Amitabh Bachchan infected with Corona again
గెట్ వెల్ సూన్..
‘ కరోనా నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా తేలింది. నా చుట్టూ ఉన్న వారు అలాగే పరిచయం ఉన్న ఎవరైనా, దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు అమితాబ్. గత ఏడాది 2021లో జూలై 11న కరోనా కారణంగా అమితాబ్ బచ్చన్ ముంబైలోని విలే పార్లేలోని నానావతి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అమితాబ్‌తో పాటు, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఆరాధ్య కూడా కరోనా కోరలకు చిక్కారు.
అమితాబ్ బచ్చన్‌తో పాటు అభిషేక్ కూడా కొద్దిరోజులు నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనా నుండి కోలుకున్న తర్వాత అమితాబ్ చాలా యాక్టివ్‌గానే ఉన్నారు. పలు సినిమా షూటింగ్స్‌తో పాటు బుల్లితెర క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 14వ సీజన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ షో సమయంలో అమితాబ్ బచ్చన్ చాలా మంది కంటెస్టెంట్స్ ను కలిశారు. అటువంటి పరిస్థితిలో.. ఆయన కరోనా బారిన పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
గతంతో కరోనా వైరస్ బారిన పడిన అమితాబ్ తన ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అమితాబ్ బచ్చన్ ‘కెబిసి 14’ సెట్‌లో చాలా జాగ్రత్తగా ఉండేవాడనీ, ఇప్పటికి కరోనా ప్రోటోకాల్ పాటిస్తాడనీ, అతనికి కరోనా ఎలా సోకిందో చెప్పడం కష్టమంటున్నారు షో నిర్వహకులు.ఇదిలా ఉంటే.. అమితాబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా? లేదా ఇంట్లో ఉన్నాడా? అనే విషయంలో క్లారిటీ లేదు.