Amit Shah And Prabhas : ప్రభాస్ ను అమిత్ షా కలవడానికి ముఖ్య కారణం అదే!

NQ Staff - September 16, 2022 / 06:23 PM IST

Amit Shah  And Prabhas  : ప్రభాస్ ను అమిత్ షా కలవడానికి ముఖ్య కారణం అదే!

Amit Shah And Prabhas  : తెలంగాణలో ఎలాగైనా అధికారం సంపాదించాలని కలలుగంటున్న బీజేపీ పెద్దలు ఇక్కడ అందివచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. తెలంగాణలో ఏది జరిగినా దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ఢిల్లీ నుంచి వాలిపోతున్నారు. ఇటీవల మునుగోడు సభకు వచ్చిన కేంద్రహోంమంత్రి అమిత్ షా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో భేటి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించారని.. ఆయనతో తెలంగాణలోని ఆంధ్రా ఓటర్ల ఓట్లు, కమ్మవారిని తమవైపు తిప్పుకునేందుకు ఈ ప్లాన్ చేశారని ప్రచారం సాగింది. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పడంతో ఈ భేటితో ప్రయోజనం దక్కలేదని అంటున్నారు.

Amit Shah will Go Prabhas House And Consult Him

Amit Shah will Go Prabhas House And Consult Him

ఇక వరంగల్ సభకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లో హీరో నితిన్ ను కలిశాడు. నితిన్ బీజేపీకి ఫేవర్ గా ఎలాంటి సినిమాలు తీయలేదు. అయినా కూడా ఆయన్ని కలిసి రాజకీయం నడిపారు. బీజేపీ తరుఫున ప్రచారం చేయడానికి నితిన్ కూడా ఓకే అన్నాడని బీజేపీ నేతలు తెలిపారు.

ఇక ఈరోజు మళ్లీ కేంద్రహోంమంత్రి అమిత్ షా

హైదరాబాద్ వస్తున్నారు. రేపు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షాతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు ఇందులో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే ఈరోజు హైదరాబాద్ వస్తున్న అమిత్ షా నేరుగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ప్రభాస్ తోపాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సెప్టెంబర్ 16న కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా అందులో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

Amit Shah will Go Prabhas House And Consult Him

Amit Shah will Go Prabhas House And Consult Him

ఇటీవలే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మృతిచెందారు. కృష్ణంరాజు గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. బీజేపీ తరుఫున ఎంపీగా గెలిచి సేవలందించారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించడానికి వస్తున్నారు.

ప్రభాస్ ఫ్యామిలీని పరామర్శించడానికి మాత్రమే అమిత్ షా వస్తున్నారని.. గతంలో కృష్ణంరాజు బీజేపీలో పనిచేసిన దృష్ట్యానే ఈ భేటి జరగబోతోందని.. అంతే తప్ప ప్రభాస్ తో అమిత్ షా భేటిలో రాజకీయం ఏం లేదని చెబుతున్నారు. ఇక అమిత్ షా ‘కార్తికేయ2’ లాంటి కృష్ణతత్వం సినిమా తీసిన హీరో నిఖిల్ ను కూడా కలవబోతున్నాడని తెలిసింది. ఇలా బీజేపీకి ఫేవర్ గా రాజకీయం సాగేందుకు టాలీవుడ్ పై బీజేపీ పెద్దలు ఫుల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us