Prabhas : హీరో ప్రభాస్‌తో భేటీ కానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.!

NQ Staff - September 14, 2022 / 06:26 PM IST

158599Prabhas : హీరో ప్రభాస్‌తో భేటీ కానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.!

Prabhas : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 17న హైద్రాబాద్ రానున్న సంగతి తెలిసిందే. తెలంగాణ విమోచన దినోత్సవం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైద్రాబాద్ వస్తున్నారు. హైద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.

Amit Shah to meet Prabhas in hyd

Amit Shah to meet Prabhas in hyd

కాగా, గతంలో అమిత్ షా హైద్రాబాద్ వచ్చినప్పుడు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతోనూ, సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్‌తోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయమై అభినందించడానికే ఎన్టీయార్‌తో భేటీ.. అని బీజేపీ వర్గాలు తొలుత చెప్పినా, ఇరువురి మధ్యా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు ఆ తర్వాత బీజేపీ నేతలు పలువురు చెప్పారు.

ప్రభాస్‌తో భేటీ కానున్న అమిత్ షా..

సెప్టెంబఱ్ 17న హైద్రాబాద్ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సినీ నటుడు ప్రభాస్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇటీవల మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన దరిమిలా, ఆ కృష్ణంరాజు సోదరుడి కుమారుడైన ప్రభాస్‌ని మర్యాదపూర్వకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవనున్నారన్నది బీజేపీ వర్గాలు చెబుతున్న వెర్షన్.

అయితే, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా బలపడేందుకు అత్యంత వ్యూహాత్మకంగా సినీ ప్రముఖులతో భేటీలు నిర్వహిస్తున్నారు బీజేపీ జాతీయ నాయకులు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. జేపీ నడ్డా తదుపరి హైద్రాబాద్ పర్యటనలో ఇంకో సినీ నటుడు నిఖిల్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అమిత్ షా పర్యటనలోనే నిఖిల్‌నీ కలుస్తారా.? అన్నది వేచి చూడాలి.