NTR : అమిత్ షాతో యంగ్ టైగర్ ఎన్టీయార్ భేటీ.! హై ఓల్టేజ్ సోషల్ మేనియా.!

NQ Staff - August 22, 2022 / 08:57 AM IST

NTR : అమిత్ షాతో యంగ్ టైగర్ ఎన్టీయార్ భేటీ.! హై ఓల్టేజ్ సోషల్ మేనియా.!

NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. బీజేపీ సీనియర్ నేత అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా, యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో డిన్నర్ మీటింగ్ కూడా జరగడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Amit Shah and NTR Meeting

Amit Shah and NTR Meeting

‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైద్రాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది..’ అంటూ అమిత్ షా, తెలుగులోనే ట్వీటేశారు కూడా.!

ఇంతకీ, ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారు.?

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీయార్ అద్భుత నటనకు అమిత్ షా ఫిదా అయ్యారనీ, ఈ నేపథ్యంలోనే ఎన్టీయార్‌ని కలిసి అభినందించాలనుకున్నారనీ, అలా ఈ భేటీ జరిగిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

అంతేనా.? అంతకు మించి, ఏమైనా రాజకీయ పరమైన అంశాలు ఇరువురి మధ్యనా చర్చకు వచ్చాయా.? ఏమోగానీ, ఈ భేటీ అయితే ఇప్పుడు తెలుగునాట హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఈ భేటీ తర్వాత ఎలాంటి మార్పులకు గురవుతాయి.? అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు, బీజేపీ అభిమానులూ ఫుల్ ఖుషీ అవుతున్నారు ఈ భేటీతో.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us