Amala Paul : టాలీవుడ్‌లో హీరోయిన్లు ‘అందుకే..’ పనికొస్తారు.! అమలా పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు.!

NQ Staff - September 13, 2022 / 10:44 PM IST

Amala Paul : టాలీవుడ్‌లో హీరోయిన్లు ‘అందుకే..’ పనికొస్తారు.! అమలా పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు.!

Amala Paul : ‘తెలుగు సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే తీసుకుంటారు. అందుకే నేను తెలుగు సినిమాకు దూరంగా వున్నాను..’ అంటోంది నటి అమలా పాల్. అమలా పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో పెను దుమారం రేపుతున్నాయ్.

Amala Paul Controversial Comments

Amala Paul Controversial Comments

ఇంతకీ అమలా పాల్ ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందట.! అమలా పాల్ నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవుతుంటాయ్. మంచి ఆదరణ దక్కించుకుంటాయ్. అలాగే, ఆమె తెలుగులో డైరెక్ట్‌గా ‘బెజవాడ’, ‘నాయక్’ తదితర సినిమాల్లో నటించింది కూడా. అలాంటిది ఇప్పుడెందుకు అమలాపాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందట.!

అమలా పాల్‌కి ఏమైంది.? ఎందుకీ కాంట్రవర్సీ.!

గతంలో సొట్ట బుగ్గల సుందరి తాప్సీ కూడా టాలీవుడ్‌పై ఇలాంటి వ్యాఖ్యలే పలుమార్లు చేసింది. ఒకానొక టైమ్‌లో ఆ మాటల్ని వెనక్కి తీసుకుని సారీ కూడా చెప్పాల్సి వచ్చింది తాప్సీ. అలాగే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా.

వాళ్లకి తానేం తక్కువ కాదనుకుందా ఏంటీ.! అమలా పాల్. ఇలాంటి వ్యాఖ్యలతో అనవసరంగా వివాదాల్లోకెక్కింది.. అంటూ నెటిజన్లు కొందరు అమలా పాల్‌పై జర గుస్సా అవుతున్నారు.

ఇటీవలే ‘కడవర్’ అనే సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించి అమలా పాల్ ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్‌తో సీక్వెల్ ప్లానింగ్స్ ‌లోనూ అమలా పాల్ వున్నట్లు తెలిసింది.

సొంత నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాతో అమలా పాల్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ తరుణంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేసిందో ఏమో.! ఆమెకే తెలియాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us