Amala Paul : టాలీవుడ్ పై ముద్దుగుమ్మ అక్కసు
NQ Staff - September 12, 2022 / 10:01 AM IST

Amala Paul : కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేసిన అమలా పాల్ ఆ మధ్య పెళ్లి చేసుకుని కెరీర్ కాస్త అటు ఇటు అయ్యింది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ వరుసగా సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Amala Paul comments on tollywood
తెలుగు సినిమాల్లో ఈమెకు ఆఫర్లు తగ్గాయి. విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో పెద్దగా సందడి చేసింది లేదు. ఒకటి రెండు వెబ్ సిరీస్ ల్లో నటించినా కూడా టాలీవుడ్ లో ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోందట.
తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు ఆమెలోని అసహనంను చూపిస్తున్నాయి. టాలీవుడ్ లో నటించేందుకు చాలా ప్రయత్నించినా కూడా ఆఫర్లు రాకపోవడంతో విమర్శలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమలా పాల్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమలో నెపొటిజం ఎక్కువగా ఉంటుంది. కుటుంబాలు కొన్ని అక్కడి సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రభావం చూపిస్తాయి. ఎక్కువ శాతం హీరోయిన్స్ కేవలం గ్లామర్ కోసమే నటించాల్సి ఉంటుంది.
ప్రతి సినిమాలో అక్కడ ఇద్దరు హీరోయిన్స్ ని నటింపజేస్తారు. అలా చేయడం వల్ల గ్లామర్ గా సినిమా ఉంటుందని వాళ్లు భావిస్తారు. సినిమాల్లో అసలు హీరోయిన్స్ కి ప్రాముఖ్యత అనేది లేకుండా వారు చూస్తారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అమలా పాల్ టాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని వాస్తవాలు ఉన్నా కూడా అలా బాహాటంగా ఆమె వ్యాఖ్యలు చేయడం తో చాలా మందికి ఆమె పై కోపం వస్తోంది.