Allu Sirish : ఊహించని రిజల్టిచ్చిన ఊర్వశివో.. ఇక అల్లు శిరీష్ ఫ్యూచరేంటో?

NQ Staff - November 24, 2022 / 09:45 PM IST

Allu Sirish : ఊహించని రిజల్టిచ్చిన ఊర్వశివో.. ఇక అల్లు శిరీష్ ఫ్యూచరేంటో?

Allu Sirish : హీరోగా కెరీర్లో ఒక్క భారీ హిట్ లేకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని మరీ ఊర్వశివో రాక్షసివో మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు అల్లు శిరీష్. న్యూ ఏజ్ లవ్ స్టోరీ, నటుడిగా తనకిది కొత్త తరహా చిత్రం అంటూ ప్రమోషన్స్ బాగానే చేసుకున్నా థియేటర్లో మాత్రం ఆడియెన్స్ నుంచి ఓవర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోలేక పోయిందీ చిత్రం.

హిట్ అని ప్రచారం చేసుకుంటూ సక్సెస్ మీట్లు పెట్టుకున్నా రియాలిటీ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. మొత్తంగా చూసుకుంటే.. థియేట్రికల్ రైట్స్ కింద రూ. 7 కోట్లు, ఓవరాల్ కలెక్షన్స్ కింద రూ. 3 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇదిగో.. ఈ మాత్రం వసూళ్లకే హిట్, సూపర్ హిట్ అంటూ ఈవెంట్లు పెట్టి మరీ సెలబ్రేట్ చేసుకున్నారా అంటూ కశ్చన్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక నిర్మాతగా ఓవైపు చిన్న సినిమాలు, మరోవైపు పెద్ద ప్రాజెక్టులతో అల్లు అరవింద్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. హీరోగా అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టారయిపోయి దుమ్ము రేపుతున్నాడు. కానీ సౌత్ వైడ్ గా కాకపోయినా కనీసం టాలీవుడ్లో అయినా హీరోగా శిరీష్ ని ఎస్టాబ్లిష్ చేయాలని అరవింద్, బన్నీ పడుతున్న కష్టాలన్నీ ఫెయిలవుతూనే వస్తున్నాయి పాపం.

ఇక ఊర్వశివో రాక్షసివో రిజల్ట్ తర్వాత పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. అల్లువారి సొంత సంస్థయిన గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమానే సరిగ్గా సక్సెస్ అవ్వకపోతే తర్వాతి రోజుల్లో శిరీష్ ని నమ్మి హీరోగా మూవీ చేసే దైర్యం చేస్తారా అన్న ఓపెన్ కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.
నిజానికి ప్రచారం చేసుకున్నట్టుగా మూవీ హిట్టయ్యే ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శిరీష్ నెక్స్ట్ ప్రాజెక్ఠ్ కూడా అనౌన్స్ చేసి ఉండేవారు కదా.

Allu Sirish Is Unable Prove Himself An Actor

Allu Sirish Is Unable Prove Himself An Actor

కానీ ఇప్పటివరకూ తర్వాతి మూవీ గురించి, అప్ కమింగ్ సినిమాల గురించీ ఊసే లేదు. ఊర్వశివో రాక్షసివో ఇచ్చిన షాక్ నుంచి తేరుకోడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా ఉందేమో మరి. ఓవైపు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, సపోర్ట్ లేకపోయినా యాక్టర్స్ గా హిట్లిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న యంగ్ హీరోలు పెరిగిపోతూనే ఉన్నారు.

కేవలం సిల్వర్ స్క్రీనే అన్న పట్టింపులకు పోకుండా ఆడియెన్సుకు రీచవ్వడానికి ఓటీటీలు, సిరీసులు, సినిమాలు అంటూ కంటెంట్ నచ్చితే కమిటవుతూనే ఉన్నారు. కానీ ఇంత బ్యాక్ గ్రౌండ్, ఓన్ ప్రొడక్షన్ హౌజ్ ఉండి కూడా ఒక్కటంటే ఒక్క బంపర్ హిట్ గానీ, యాక్టర్ గా ప్రూవ్ చేసుకునే ప్రాజెక్ట్ గానీ రాకపోవడం కాస్త కష్టమనిపించే మాటే.

మరసలు ఎక్కడ తేడా కొడుతోందో? ఏ ఫ్యాక్టర్ ని తను మిస్సవుతున్నాడో తెలుసుకుని తర్వాతి ప్రాజెక్ట్స్ నుంచయినా అల్లు శిరీష్ రియలైజయితే హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి చాన్స్ ఉంది. లేదంటే.. ఇంకా స్ట్రగ్లింగ్ స్టార్ గానే మిగిలిపోయే ప్రమాదమూ ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us