Allu Ayaan : త‌గ్గేదే లే అంటున్న అయాన్.. తండ్రి మాదిరిగా వాక్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన బన్నీ త‌న‌యుడు

Allu Ayaan : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం పుష్ప. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్ర బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు కురిపించింది.ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట పుష్ప రాజ్ దుమ్ములేపాడు. బ‌న్నీ సినిమా మంచి విజ‌యం సాధించడంతో ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Allu Ayaan Imitating His Father Allu Arjun As Pushpa Raj
Allu Ayaan Imitating His Father Allu Arjun As Pushpa Raj

మ‌రి కొంద‌రు బ‌న్నీస్టైల్‌లో వీడియోలు చేస్తూ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా మ‌న ఇండియన్ క్రికెట‌ర్స్ ఒక‌రి త‌ర్వాత ఒకరు బ‌న్నీ మాదిరిగా వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ని అల‌రిస్తున్నారు. ఎవ‌రు ఎన్ని చేసిన త‌న కొడుకు అల్లు అయాన్ చేసిన వీడియో మాత్రం బ‌న్నీని తెగ అల‌రించింద‌నే చెప్పాలి. తాజాగా ఓటీటీలో పుష్ప చిత్రం విడుద‌ల కాగా, ఈ సినిమా చూసి అయాన్ త‌న తండ్రి మాదిరిగా వాక్ చేశాడు.

పుష్ప‌రాజ్ గా మారిన అయాన్‌ని చూసి అంద‌రు స్ట‌న్ అవుతున్నారు.బ‌న్నీ అయితే తెగ మురిసిపోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ స‌మ‌యంలో అయాన్ స్పెష‌ల్ విషెస్ అందించాడు. దాని కోసం అయాన్ పడ్డ కష్టం బన్నీని కదిలించినట్టుంది. తన కొడుకు ప్రేమను చూసి బన్నీ తెగ మురిసిపోయాడు. పుష్ప రిలీజ్ స్పెషల్‌గా అల్లు అయాన్ ఓ ఆర్ట్ వేశాడు. దాన్ని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

పుష్పలా ఓ బొమ్మను గీశాడు.. ఆల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అని రాసేశాడు. అయితే వాటిని చూసిన అల్లు అర్జున్ మురిసిపోయాడు. థ్యాంక్యూ నా చిన్ని బాబు.. లవ్యూ అయాన్..ఈ కార్డ్‌తో ఈ ఉదయాన్ని మరింత స్పెషల్‌గా మారిందని బన్నీ పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా పుష్ప. గతంలో ఆర్య, ఆర్య2 వచ్చాయి. సూపర్ హిట్ అనుకున్న ఆర్య సుకుమార్ కి డెబ్యూ మూవీ కాగా, అల్లు అర్జున్ కి ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం. ఇప్పుడు మళ్లీ దాదాపు 12 ఏళ్ల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘పుష్ప’ వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

మొదటి పార్ట్ విడుదలవ్వగా, రెండోది ఈ ఏడాది విడుదల కానుంది. మొదటి పార్ట్ కు ‘పుష్ప: ది రైజ్’ అని పెట్టారు. ఇక రెండో పార్ట్ కు ‘పుష్ప: ది రూల్’ అని పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ , రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు చేశారు.