Allu Arjun And Arha : వావ్‌.. కూతురుతో బన్నీ ఏం చేస్తున్నాడో చూడండి

NQ Staff - September 22, 2022 / 05:41 PM IST

160111Allu Arjun And Arha : వావ్‌.. కూతురుతో బన్నీ ఏం చేస్తున్నాడో చూడండి

Allu Arjun And Arha: అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత ఎక్కువ సమయంలో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఆయన కూతురు అర్హ తో సమయం గడిపేందుకు బన్నీ ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తన కూతురుతో గడిపిన

ప్రతి ఒక్క మూమెంట్ ని బన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా కూతురు అర్హ తో చెస్ ఆడుతూ అల్లు అర్జున్ అందరి దృష్టిని ఆకర్షించారు.

Allu Arjun While Playing Chess with Daughter Arha

Allu Arjun While Playing Chess with Daughter Arha

అల్లు వారి కాంపౌండ్ కి చెందిన వారు ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తండ్రి కూతురు ఇలా ఆటలో మునిగిపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అర్హ అప్పుడే చేస్ ఆడేంత పెద్దమ్మాయి అయిందా అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

మరి కొందరు ఈ ఆటలో తండ్రి బన్నీ గెలుస్తాడా.. కూతురు అర్హ గెలుస్తుందా అంటూ చర్చించుకుంటున్నారు. ఈ గేమ్ లో వారిద్దరు గెలుస్తారు అంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి రెడీ అవుతున్నాడు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టుగా ఇటీవల చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఆ తర్వాత కూడా బన్నీ వరుసగా సినిమాలు చేసేందుకు ఇప్పటికే ఓకే చెప్పారు. ఆ సినిమాల వరుస అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.