Allu Arjun : ముసుగేసుకుని రహస్యంగా వెళ్ళి ‘ఎఫ్3’ సినిమా చూసిన అల్లు అర్జున్.!
NQ Staff - June 4, 2022 / 11:42 AM IST

Allu Arjun : ఇంట్లోనే మినీ థియేటర్లు చాలామంది సినీ ప్రముఖులకు వున్నాయ్. రాజకీయ ప్రముఖులకు, బడా కుటుంబాలకూ ఈ వెసులుబాట్లు వున్నాయి. క్యూబ్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్ళల్లోనే థియేటర్ల స్థాయిలో సౌకర్యాలు సమకూర్చేసుకుని, సినిమా ప్రదర్శనలు వేసేసుకుని చూసేస్తుంటారు. అల్లు అర్జున్ కూడా అలాగే కొన్ని సినిమాలు చూస్తాడు.
అయితే, ఇంకొన్ని సినిమాల్ని మాత్రం ప్రత్యేకంగా థియేటర్లలోనే అల్లు అర్జున్ చూస్తాడట. అది కూడా హైద్రాబాద్‌లోని కూకట్ పల్లిలోని ఓ థియేటర్లో అల్లు అర్జున్ ‘ఎఫ్3’ సినిమా చూశాడట అల్లు అర్జున్. ఈ విషయాన్ని స్టైలిష్ స్టార్.. అదేనండీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బయటపెట్టారు.
సినిమా ప్రారంభమయిన కొద్ది నిమిషాల తర్వాత ముసుగేసుకుని, రహస్యంగా థియేటర్లోకి అల్లు అర్జున్ అడుగు పెడతాడట. ఇంటర్వెల్‌కి కొద్ది సమయం ముందు బయటకు వచ్చేస్తాడట. మళ్ళీ ఇంటర్వెల్ పూర్తయ్యాక.. తెరపై బొమ్మ మొదలయ్యాక వెళతాడట. సినిమా పూర్తయ్యేముందు బయటకు వచ్చేస్తాడట అల్లు అర్జున్.

Allu Arjun Watched F3 Movie in Disguise
అన్నట్టు, ‘ఎఫ్3’ సినిమాని ఇంట్లో చూడాలని అల్లు అర్జున్ అనుకుంటే, కాదు థియేటర్లోనే చూడాలని తాను సూచించినట్లు అల్లు అరవింద్ చెప్పారు.
‘ఎఫ్3’ సినిమా లాగానే, మారుతి సినిమా కూడా ఇంట్లో కూర్చుని జడ్జ్ చేసేది కాదనీ, థియేటర్లలోనే సినిమాని చూడాలని చెప్పారు అల్లు అరవింద్. గోపీచంద్, రాశి ఖన్నా నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా ఈవెంట్‌లో అల్లు అరవింద్ ఈ ‘అల్లు అర్జున్ ముసుగు కథ’ చెప్పడం జరిగింది.