Allu Arjun: అల్లు అర్జున్ కొత్త బిజినెస్‌.. రౌడీ హీరో బాట ప‌ట్ట‌బోతున్నాడా..!

Allu Arjun: ఈ మ‌ధ్య మ‌న హీరోలు సినిమాలు చేస్తూనే బిజినెస్ రంగంలో స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్ బాబు, వెంక‌టేష్ ఇలా ప‌లువురు బిజినెస్ రంగంలో స‌త్తా చాటుతున్నారు. అల్లు అర్జున్ కూడా మ‌ల్టీ ప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్ట‌గా, త్వ‌ర‌లోనే ఈ మ‌ల్లీ ప్లెక్స్ లాంచ్ కానుంది. ఇక దీంతో పాటు బ‌ట్టల బిజినెస్ కూడా అల్లు అర్జున్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

allu arjun starts new business2
allu arjun starts new business2

టాలీవుడ్ లో ఫ్యాషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు వారబ్బాయి అల్లు అర్జున్. పుష్ప సినిమాతో మ‌నోడు ఐకాన్ స్టార్‌గా మారాడు. బ‌న్నీకి ఇప్పుడు మ‌న తెలుగు రాష్ట్రాల‌లోనే కాక దేశం మొత్తం క్రేజ్ ఉంది. ఇప్పుడు మెగాఇమేజ్ నుంచి బయటపడి తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్న బన్నీ ఇప్పుడు విజయ్ దేవరకొండ బాటలో సొంతంగా దుస్తుల వ్యాపారం ఆరంభించబోతున్నాడట.

విజయ్ రౌడీవేర్ ఇప్పటికే మార్కెట్ తో తమదైన ముద్రవేశాయి. ఇప్పటికే తన ఇమేజ్ ని ఎఎ బ్రాండ్ రూపంలో ప్రమోట్ చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ తను ఆరంభించబోయే దుస్తులకు కూడా ఎఎ బ్రాండ్ వేర్ గా మార్కెట్ లోకి తీసుకు రాబోతున్నాడట. అతి త్వరలో వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

allu arjun starts new business1
allu arjun starts new business1

ఇప్పటికే బ్రాండింగ్ ఏజెన్సీలు, పెట్టుబడిదారులతో సమావేశాలను నిర్విహించారు. ప్రస్తుతం కోవిడ్ మూడోవేవ్ ఉదృతంగా ఉన్నందువల్ల ఎఎబ్రాండ్ లాంచింగ్ కొద్దిగా ఆలస్యం అయిందని లేకుంటే ఈ పాటికే ఎఎబ్రాండ్ మార్కెట్ లో ఉండి ఉండేదని చెబుతున్నారు. పరిస్థితులు మామూలు స్థితికి చేరగానే బన్నీ ఎఎ బ్రాండ్ లాంచ్ అవుతుందని అంటున్నారు.

రీసెంట్‌గా పుష్ప చిత్రంతో అతి పెద్ద విజ‌యం సాధించిన అల్లు అర్జున్ త్వ‌ర‌లో పుష్ప 2 షూటింగ్ మొద‌లు పెట్టనున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన త‌ర్వాత టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్స్‌తో సినిమాలు చేయ‌నున్నాడు. వాటికి సంబంధించి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.