Allu Arjun : ఏయ్ బిడ్డా సాంగ్‌లోని ఓ షాట్ కోసం 12 గంట‌లు శ్ర‌మించిన అల్లు అర్జున్

Allu Arjun : అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ పుష్ప‌. డిసెంబర్ 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా సాధించింది. అంతే కాక కొత్త కొత్త రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇందులో ఉన్న అయిదు పాటలు బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి.

Allu Arjun Pushpa Movie song making
Allu Arjun Pushpa Movie song making

పుష్ప‌ సినిమాలోని 5 పాటలు ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ జాబితాలో ఉన్నాయి. మొదటి స్థానంలో ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ సాంగ్, రెండో స్థానంలో ‘సామి సామి’ సాంగ్, 24వ స్థానంలో ‘శ్రీవల్లి’ సాంగ్, 74వ స్థానంలో ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్, 97వ స్థానంలో ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ ఉన్నాయి. ఇలా సినిమాలో ఉన్న ఐదు పాటలు టాప్ 100లో ఉండడంతో మరో రికార్డ్ సాధించింది.

పుష్ప సినిమా కోసం బ‌న్నీ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఏయ్ బిడ్డా పాటలోని ఈ ఒక్క షాట్ కోసం బ‌న్నీ 12 గంటల పాటు శ్రమించారు. పాట షూటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2 గంటల వరకు సాగింది. ఇందులో 24 కాస్ట్యూమ్స్ మార్చ‌డ‌మే కాకుండా ప‌లు వేరియేష‌న్స్ చూపించాడు. అతను నిజంగా ఒక ఐకాన్ స్టార్! అంటూ పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు.

వెండితెరపై అల్లు అర్జున్- రష్మిక మందన జోడీ అబ్బురపరిచింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని విడుదలై నెల రోజులు తిరగకుండానే ఓటీటీలో రిలీజ్ చేశారు. పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ ధర చెప్పింది ఈ సినిమా హక్కులు తీసుకుంది అమెజాన్ ప్రైమ్. హిందీ మినహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పుష్ప మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

హిందీలో ‘పుష్ప’ జోరు మామూలుగా లేదు. విడుద‌లై 20 రోజులు దాటిన‌ప్ప‌టికీ పుష్పకు హిందీలో పోటీ ఇచ్చే సినిమా ఇంత‌వ‌ర‌కు రాలేదు. దీంతో ఈ సినిమా రూ.80 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప హిందీలో వ‌న్ హార్స్ రేస్ కొన‌సాగిస్తోంద‌ని సినీ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ తెలిపారు.