Pushpa Movie : పుష్ప ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. హిందీలోను ఇక ర‌చ్చ ర‌చ్చే..!

Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్‌ మంచి వసూళ్లనే దక్కించుకుంది.

Allu Arjun Pushpa Movie Hindhi streaming soon
Allu Arjun Pushpa Movie Hindhi streaming soon

ఏ హిందీ సినిమాకి సాధ్యం కాని విధంగా ఈ చిత్రం అక్కడ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటికే సౌత్‌లో `పుష్ప` ఓటీటీలో విడుదలైంది. జనవరి 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేశారు. హిందీలో థియేటర్‌ కలెక్షన్లు భారీగా ఉండటంతో అక్కడ మాత్రం ఓటీటీ రిలీజ్‌ చేయలేదు.

తాజాగా హిందీ వెర్షన్‌ `పుష్ప`ని విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయబోతున్నట్టు అమెజాన్‌ ప్రైమ్‌ వెల్లడించింది. జనవరి 14న శుక్రవారం ఈ చిత్రం హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది. సినిమా అన్ని భాషల్లో ఓటీటీ సుమారు రూ.85కోట్లకు అమ్ముడు పోయిందని టాక్‌.

హిందీలో 24 రోజుల్లో.. రూ. 37.45 కోట్ల షేర్ (రూ. 80.48 కోట్టు గ్రాస్) వసూళ్లు రాబట్టింది పుష్ప చిత్రం. హిందీలో ఆదివారం రూ. 1.25 షేర్ (రూ. 3.48 కోట్ల గ్రాస్ )వసూళ్లు సాధించింది. ఇక మన దేశంలో నార్త్ రీజియన్‌లో ఇరగదీస్తోంది. మొత్తంగా హిందీ వెర్షన్ మొత్తం రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉంది. ఆల్రెడీ తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మంచి వసూళ్లనే రాబడుతోంది.

పుష్ప సినిమాకు రూ. 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో ఏపీలో పలు ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్‌గా లాభాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 24 రోజుల్లో ఈ సినిమాకు రూ. 166.20 కోట్ల షేర్ వచ్చింది.