Pushpa Movie : రూ.146 కోట్ల టార్గెట్‌ని నాలుగు వారాల్లో చేధించిన పుష్ప‌.. ఎంత లాభాలు రాబ‌ట్టాడో తెలుసా?

Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ‘పుష్ప’ అన్ని చోట్ల మంచి విజయం సాధించి భారీ కలెక్షన్స్ ని సాధిస్తోన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. హిందీ లో పుష్ప హవా మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఇక రీసెంట్ గా ఈ చిత్రం హిందీ వెర్షన్ లోనే నేపాల్ దేశంలో రిలీజ్ అయ్యింది.

Allu Arjun Pushpa Movie collections
Allu Arjun Pushpa Movie collections

పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ ఆరంభం నుంచే సత్తా చాటుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ విజయం సాధించింది.

పుష్ప మూవీ థియేట్రికల్ బిజినెస్ అల్లు అర్జున్‌కు ఆంధ్రా, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో ‘పుష్ప’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు వరకూ బిజినెస్ జరిగిందట.

‘పుష్ప’ 4 వారాలకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 40.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 15.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.06 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.87 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.94 కోట్లు, గుంటూరులో రూ. 5.10 కోట్లు, కృష్ణాలో రూ. 4.23 కోట్లు, నెల్లూరులో రూ. 3.08 కోట్లతో.. ఏపీ తెలంగాణలో రూ. 84.86 కోట్లు షేర్, రూ. 132.37 కోట్లు గ్రాస్ వచ్చింది.

‘పుష్ప’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా నాలుగు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 168.75 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఇది రూ. 22.75 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.