Allu Arjun Pushpa : మాస్ లుక్‌లో చిత‌క్కొడుతున్న అల్లు అర్జున్.. స్టెప్పులు కూడా అదోర‌కంగా ఉన్నాయే..!

Allu Arjun Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్యూట్ బేబి ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప‌. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

Allu Arjun Pushpa mass look goes viral
Allu Arjun Pushpa mass look goes viral 1

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Allu Arjun Pushpa mass look goes viral
Allu Arjun Pushpa mass look goes viral

తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో సింగిల్ నవంబర్ 19న‌ పూర్తి పాట విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఇందులో అల్లు అర్జున్ గెట‌ప్ ఆయ‌న వేసే స్టెప్స్ అదోర‌కంగా ఉన్నాయి. ఊర‌మాస్ గా బ‌న్నీ ఈ సినిమాలో అల‌రించ‌నున్నాడు. నుదుటన బొట్టు, ఒంటినిండా బంగారపు చైన్లు, ఉంగరాలతో కళ్లజోడు పెట్టుకుని సరికొత్త అవతారంలో కనిపించారు.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

పుష్ప చిత్రంలో చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్‌గా, ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక న‌ట‌స్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న విడుద‌ల చేయ‌నున్నారు.