Allu Arjun : తమ్ముడు శిరీష్ కోసం అన్న అల్లు అర్జున్ వస్తున్నాడహో.!

NQ Staff - November 5, 2022 / 09:51 PM IST

Allu Arjun : తమ్ముడు శిరీష్ కోసం అన్న అల్లు అర్జున్ వస్తున్నాడహో.!

Allu Arjun : అల్లు అర్జున్ ఎక్కడ.? తన తమ్ముడు అల్లు శిరీష్ సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రమోషన్ కోసం అల్లు అర్జున్ ఎందుకు రాలేక పోయాడు.? సినిమా గురించి కనీసం ట్వీట్ అయినా ఎందుకు వెయ్యలేదు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొచ్చాయ్.

ఇటీవలే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా విడుదలైంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన విషయం విదితమే. అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్.

పెద్దలకు మాత్రమే అనేస్తున్నారేంటీ.?

యూత్ ఈ సినిమాకి పెద్దగా కనెక్ట్ కాలేదు.. ఫ్యామిలీ ఆడియన్స్ అటువైపు వెళ్ళడంలేదు. లిప్ టు లిప్ కిస్ సీన్స్ దగ్గర్నుంచి, ఓవర్ డోస్ రొమాన్స్ వరకు ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాని ప్రేక్షకులు పట్టించు కోకుండా చేసేశాయ్.

ఈ సంగతి ఇలా వుంటే, రేపు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్‌కి అల్లు అర్జున్ హాజరు కాబోతున్నాడు. సక్సెస్ మీట్ లాంటిదని అనుకోవాలేమో. అల్లు అర్జున్ ఏం చెప్పబోతున్నాడు ఈ సినిమా గురించి.? అన్నది అంతా ఎదురుచూస్తున్నారు.

యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్.. అని ఈ ఈవెంట్‌కి నిర్వాహకులు పేరు పెట్టారండోయ్.!

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us