Allu Arjun : సంక్రాంతి రోజున రేర్ ఫీట్ అందుకున్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Allu Arjun : ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్‌గా అల‌రించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్‌గా మారాడు. పుష్ప చిత్రంలో బ‌న్నీ న‌ట‌న‌పై సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్ర‌ముఖులు పుష్ప చిత్రాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. క్రికెట‌ర్స్ అయితే పుష్ప ని అనుకురించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారి వీడియోలు వైర‌ల్‌గా మారుతున్నాయి.

Allu Arjun Instagram followers record
Allu Arjun Instagram followers record

పుష్ప సినిమాతో బ‌న్నీ నార్త ఆడియ‌న్స్‌కి కూడా చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. ఇన్ని రోజులు యూట్యూబ్‌లో డబ్బింగ్ సినిమాలు, ఉత్తరాది చానెళ్లలో డబ్బింగ్ చిత్రాలతో అక్కడి ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సారి కూడా అదే డబ్బింగ్ సినిమాతో వెండితెరపై కనిపించాడు. పుష్ప సినిమాను హిందీలో కూడా డబ్ చేసిన సంగతి తెలిసిందే. అలా మొత్తానికి బన్నీ ఇప్పుడు ఉత్తరాదిలో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అయ్యాడు.

పుష్ప దెబ్బకు హిందీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. బాలీవుడ్‌లో పుష్ప దగ్గర దగ్గరగా 80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ కలెక్షన్లతో అందరూ కళ్లప్పంగించి చూశారు. పుష్పకు నార్త్‌లో ప్రమోషన్స్ ఏమీ లేకపోయినా కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే బన్నీ దెబ్బకు హిందీ బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది.

అలా బాక్సాఫీస్ వద్ద బన్నీ సత్తా చాటేశాడు. ఇక సోషల్ మీడియాలో అయితే ముందు నుంచీ బన్నీ తన ఆధిపత్యాన్ని చాటుతూ వస్తున్నాడు. తాజాగా ఇన్ స్టాగ్రాంలో బన్నీ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. సంక్రాంతి రోజున బన్నీకి ఇన్ స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్లు వచ్చారు. నేడు ఆ ఫీట్‌ను బన్నీ అందుకున్నాడు. ఇలా దక్షిణాది హీరోల్లో బన్నీ దూసుకుపోతూనే ఉన్నాడు.

ఫిబ్ర‌వ‌రి నుండి పుష్ప 2 చిత్ర షూటింగ్ మొద‌లు పెట్ట‌నుండ‌గా, ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకుంటున్నాడు. ఆ త‌ర్వాత బ‌న్నీ మ‌రి కొన్ని క్రేజీ ప్రాజెక్టులు చేయ‌నున్నాడు. వీటిపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.