Allu Arjun : ఈ సారి కూడా అల్లు అర్జున్ జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుందా.?
NQ Staff - July 20, 2022 / 01:00 AM IST

Allu Arjun : రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘ది వారియర్’ సినిమా అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా అట. లింగు స్వామి తొలుత అల్లు అర్జున్‌కే వినిపించాడట ఈ స్టోరీ. అయితే, అల్లు అర్జున్ నో చెప్పడంతో, ఆ స్ర్కిప్టు రామ్ వద్దకు వచ్చిందట.

Allu Arjun Icon Movie update
అయితే, ‘ది వారియర్’ రిజల్ట్ సంగతేంటో తెలిసిందే కదా. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్లాప్ లిస్టులోనే పడేశారు మెల్లగా ‘ది వారియర్’ సినిమాని. సో, అల్లు అర్జున్ అందుకే ఈ స్ర్కిప్టుకి నో చెప్పాడని అంటున్నారు.
బన్నీ డెసిషన్ అప్పుడలా.. ఇప్పుడలా.!
ఇప్పుడు ఇలాంటిదే మరోటీ జరగబోతోందట. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి వుంది. ‘ఐకాన్’ అనే టైటిల్‌ని కూడా అనౌన్స్ చేశారు ఈ సినిమాకి. అయితే, స్ర్కిప్టు విషయంలో కొన్ని అనుమానాల కారణంగానే ఆ సినిమాని బన్నీ పక్కన పెట్టేశాడనే ప్రచారం వుంది.
అదే స్ర్కిప్టుని ఇప్పుడు రామ్ ఓకే చేశాడట. రామ్ పోతినేని హీరోగా ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. అయితే, ఈ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్ అవుతుందా.? ఈ సినిమా విషయంలోనూ అల్లు అర్జున్ జడ్జిమెంట్ కరెక్టే అవుతుందా.? అనే అనుమానాలు వస్తున్నాయ్.
దాంతో రామ్ అభిమానులు రామ్‌కి సూచిస్తున్నారట. అసలే ‘ది వారియర్’ రిజల్ట్ అంతంత మాత్రం అనిపించింది. ఈ టైమ్‌లో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తే బావుంటుందని రామ్‌ని స్వీట్‌గా హెచ్చరిస్తున్నారట ఫ్యాన్స్. చూడాలి మరి, రామ్ ముందు జాగ్రత్తగా వెనక్కి తగ్గుతాడా.? లేక ముందుకు దూసుకెళ్తాడా.?