Allu Arjun : అల్లు అర్జున్ అభిమానుల అతి.! తెరవెనుక వున్నదెవరబ్బా.?
NQ Staff - November 13, 2022 / 08:46 PM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు, గీతా ఆర్ట్స్ కార్యాయలం దగ్గర హంగామా సృష్టించారు. అదీ ‘పుష్ప-2’ అప్డేట్ కోసం.! కామెడీగా వుంది కదా.? ‘పుష్ప-2’ అప్డేట్ కావాలంటే, మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం దగ్గర కదా హంగామా చేయాల్సింది..? ఆమాత్రం సోయ వుంటే, అల్లు అర్జున్ అభిమానులెలా అవుతారు.? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
‘అందరికీ అభిమానులుంటారు.. నాకు మాత్రం ఆర్మీ వుంది..’ అని పదే పదే అల్లు అర్జున్ చెబుతున్నాడు. ప్చ్.. అల్లు అర్జున్ పరువు తీసేస్తున్నారు ఈ అభిమానులు.
అప్డేట్ ఇవ్వకపోతే.. ఆందోళనలు చేస్తారా.?
డబ్బులు ఖర్చుపెట్టేది నిర్మాణ సంస్థ. సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో చిత్ర నిర్మాణ సంస్థ చూసుకుంటుంది. ‘పుష్ప ది రైజ్’ అంచనాలకు మించి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. దాంతో, ‘పుష్ప ది రూల్’ విషయమై ఆచి తూచి అడుగెయ్యాలన్నది మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచన.
ఇటీవల, టెస్ట్ షూట్ చేశారు. స్టిల్ లేదా వీడియో వదలాలనే ఆలోచనతోనూ వుంది చిత్ర నిర్మాణ సంస్థ. ఇంతలోనే అభిమానుల అత్యుత్సాహం ఆగడంలేదాయె.
అసలు వాళ్ళంతా అల్లు అర్జున్ అభిమానులేనా.? అన్నది ఓ డౌట్. ఈ మధ్య అభిమానుల పేరుతో అడ్డగోలు వ్యవహారాలు చేస్తూ, ఆయా హీరోలకు తలనొప్పిగా మారుతున్నారు కొందరు.
‘పుష్ప ది రూల్’ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ చేయకూడదు.. గీతా ఆర్ట్స్‌కి ఇచ్చేయాలని, గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద హంగామా నడిచిందంటే, తెరవెనుకాల పెద్ద కథే వుందనిపిస్తోంది. ఇంతకీ, ఆ పెద్ద కథ ఏంటబ్బా.? ఆ కథ నడుపుతున్నదెవరబ్బా.?