Allu Arjun : అమెరికా చెక్కేసిన అల్లు అర్జున్.! మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి డుమ్మా.!
NQ Staff - August 19, 2022 / 04:27 PM IST

Allu Arjun : చెప్పను బ్రదర్.. అంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని గతంలో కెలికిన అల్లు అర్జున్, ఇప్పుడు మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. గత కొంతకాలంగా, అల్లు అర్జున్ అభిమానులు.. మెగా కాంపౌండ్‌ని టార్గెట్ చేస్తోన్న విషయం విదితమే.
అల్లు అర్జున్ మద్దతు లేకుండా, ఆయన అభిమానులు ఇలా చెలరేగిపోవడం జరుగుతుందా.? అన్నది సినీ పరిశ్రమలో జరుగుతోన్న చర్చ. ఆ సంగతి పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు హాజరవడంలేదు అల్లు అర్జున్. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
మోగా కార్నివాల్.. అమెరికా చెక్కేసిన అల్లు అర్జున్..

Allu Arjun Facing Wrath of Mega Fans
మెగా కార్నివాల్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మెగా కాంపౌండ్‌కి సంబంధించిన పలువురు హీరోలు, ఇతర సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారని మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటికే ప్రకటించారు.
ఇంతలోనే, అల్లు అర్జున్ అమెరికా చెక్కేశాడు. అయితే, చాలా రోజుల క్రితమే ఈ ట్రిప్ డిసైడ్ అయ్యిందన్నది అల్లు అభిమానుల నుంచి వస్తోన్న వాదన. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఎప్పుడో తెలుసు.. కార్నివాల్ గురించి కూడా ముందే సమాచారం అంది వుండాలి. ప్రతి యేడాదీ వేడుకలు జరుగుతాయ్. మరి, అల్లు అర్జున్ ఎందుకు ముందుగానే, అప్రమత్తమై.. విదేశీ ప్రయాణం పెట్టుకున్నట్టు.? అన్నది మెగా అభిమానుల డౌటానుమానం.