Allu Arjun : ఫ్యామిలీతో లంచ్ టైం.. బ‌న్నీ స్టైలిష్ లుక్ చూసి ఆశ్చ‌ర్యంలో అభిమానులు

Allu Arjun : సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, ర‌ష్మిక ప్రధాన పాత్ర‌లుగా రూపొందిన చిత్రం పుష్ప. ఈ సినిమాకి బ‌న్నీతో పాటు చిత్ర బృందానికి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయి. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. 300 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు కూడా.

Allu Arjun enjoying with family
Allu Arjun enjoying with family

అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత బ‌న్నీ న‌టించిన ఈ సినిమాకి మంచి పేరు ప్రఖ్యాత‌లు సంపాదించాడు అల్లు అర్జున్. బ‌న్నీ న‌ట‌న‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులే కాదు బాలీవుడ్ సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తుంది. రీసెంట్‌గా ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఈ మూవీని వీక్షిస్తూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

గ‌త కొద్ది రోజులుగా క్ష‌ణం తీరిక‌లేకుండా చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న బ‌న్నీ ఇప్పుడు ఫ్యామిలీతో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు. రీసెంట్‌గా కూతురితో చిల్ అవుతున్న ఫొటోని షేర్ చేసిన బ‌న్నీ ఇప్పుడు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోజ‌నం ఆరంగిస్తూ క‌నిపించాడు. ఇందుకు సంబంధించిన పిక్ వైర‌ల్ కాగా, ఇందులో బ‌న్నీ స్టైలిష్ లుక్ లో క‌నిపించారు.

బ‌న్నీ ష‌ర్ట్ పైన చేతి ముద్ర‌తో పాటు ఇది సర్ నా బ్రాండ్ అని రాసి ఉంది. పుష్ప సెకండ్ పార్ట్‌లోను బ‌న్నీ న‌టించ‌నుండ‌గా, ఆయ‌న మాస్ లుక్‌ని కొన‌సాగిస్తున్నారు. సౌత్ టూ నార్త్ వరకు బన్నీ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. పుష్ప సినిమా చూసిన ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది పుష్ప సినిమా చూసారు. ఈ మధ్యే సినిమా చూసిన మహేష్ బాబు.. సూపర్ ఎగ్జైట్ అయిపోయారు. అల్లు అర్జున్ నటనను ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ అయిపోతున్నారు.