Allu Arjun And Krishnam Raju : బన్నీకి కొంచెం అయినా బుద్ది ఉందా అంటూ తిడుతున్న ఫ్యాన్స్‌

NQ Staff - September 11, 2022 / 02:53 PM IST

Allu Arjun  And Krishnam Raju  : బన్నీకి కొంచెం అయినా బుద్ది ఉందా అంటూ తిడుతున్న ఫ్యాన్స్‌

Allu Arjun And Krishnam Raju  : నేడు తెల్లవారుజామునే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందడంతో మొత్తం సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సినీ ప్రేమికుల మరియు ఆయనను అమితంగా అభిమానించే అభిమానులు దుఃఖంలో ఉన్నారు.

ఈ సమయంలో సోషల్ మీడియా

మొత్తం కూడా కృష్ణంరాజు గురించిన చర్చ జరుగుతోంది. ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవ ఆయన నటించిన సినిమాలు ఆయన రాజకీయాల్లో సాధించిన విజయాలు ఆయన ఇండస్ట్రీకి వారసుడిగా ప్రభాస్ ఇవ్వడం.. ఆయన సాధిస్తున్న గొప్ప విజయాలు గురించి చర్చించుకుంటున్నారు.

వందల సంఖ్యలో టాలీవుడ్ ప్రముఖులు కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టారు. అంతమంది కృష్ణంరాజు గురించి తలుచుకుంటూ దుఃఖంలో ఉండగా.. అల్లు అర్జున్ మాత్రం తనకు నిన్న రాత్రి వచ్చిన సైమా అవార్డు పై స్పందిస్తూ సంతోషంగా కొద్ది సేపటి క్రితం ట్వీట్‌ చేశాడు.

Allu Arjun Did Not React All To Krishnam Raju Death

Allu Arjun Did Not React All To Krishnam Raju Death

అవార్డు రావడం ఆయనకే కాకుండా ఆయన అభిమానులకు కూడా సంతోషమే కానీ ఈ సమయంలో కృష్ణంరాజు వంటి దిగ్గజ నటుడు మృతి చెందగా సైమాకి కృతజ్ఞతలు తెలుపుతూ తనకు అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ఒక స్థాయిలో ఏకిపారేస్తున్నారు.

ఆయన అభిమానులు మరియు ఇతర నెటిజన్స్ కూడా కాస్తయినా బుద్ధుందా నీకు అంటూ ఘాటుగానే అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అల్లు అర్జున్ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు.

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన గొప్ప వ్యక్తిని కోల్పోయిన సమయంలో ఆయన గురించి ప్రస్తావిస్తూ సంతాపం తెలియజేస్తూ ట్వీట్‌ చేయాల్సింది పోయి సైమా అవార్డ్‌ ల గురించి ట్వీట్ చేయడం అల్లు అర్జున్ కే చెల్లిందంటూ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా గుసగుసలాడుకుంటున్నారు.

అవార్డు గురించి ట్విట్ చేసిన తర్వాత అయినా కృష్ణంరాజు మృతి పట్ల అల్లు అర్జున్ ట్వీట్‌ చేస్తాడేమో అని అంత ఎదురు చూశారు. కానీ కృష్ణంరాజు మృతికి అల్లు అర్జున్ కనీసం స్పందించలేదు. దాంతో అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బూతుల వర్షం కురిపిస్తూ ఆయన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఇదేనా నీ సంస్కారం అంటూ తిడుతున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us