Akhanda : బిగ్ న్యూస్.. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్

Akhanda : నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం అఖండ‌. అదిరిపోయే డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్సులతో బాలయ్యను అభిమానులకు మెచ్చేట్టు చూపిస్తాడు బోయపాటి. సింహా, లెజెండ్ తరువాత మూడో సారి అఖండ అంటూ రాబోతోన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన టీజర్, సాంగ్, పోస్టర్లు ఇలా అన్నింటితో అఖండ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

allu arjun chief guest for akhanda movie
allu arjun chief guest for akhanda movie

డిసెంబ‌ర్ 2న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌మోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. తాజాగా అఖండ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. నవంబర్ 27న శిల్పా కళా వేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. చిత్రయూనిట్‌తో పాటు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతోన్నారు.

allu arjun chief guest for akhanda movie
allu arjun chief guest for akhanda movie

అయితే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ రాబోతోన్నాడంటూ రూమర్లు వచ్చాయి. కానీ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో పూర్తి క్లారిటీ వ‌చ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. బాల‌య్య ప్ర‌స్తుతం ఆహా కోసం అన్ స్టాప‌బుల్ చేస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు త‌మ స‌పోర్ట్ బాల‌య్య‌కు ఇస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

ఇక గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి దర్శకులు మాత్రం ఈవెంట్‌కు వస్తారని తెలుస్తోంది. ఎందుకంటే బాలయ్య తదుపరి చిత్రాలు తెరకెక్కించే దర్శకులు వాళ్లే. ఈ చిత్రం కోసం తమన్ అద్భుతమైన పాటలు అందించినట్టు కనిపిస్తోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.

ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సీ రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.