Anasuya : పుష్ప సెకండ్ పార్ట్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన సుకుమార్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తొలి భాగం ఇటీవలే విడుదలై నిర్మాతలకు లాభాల పంట పండించింది. వెండితెరపై అల్లు అర్జున్- రష్మిక మందన జోడీ అబ్బురపరిచింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని విడుదలై నెల రోజులు తిరగకుండానే ఓటీటీలో రిలీజ్ చేశారు.

Allu Arjun and Sukumar Pushpa Movie part 2 Anasuya crazy update
Allu Arjun and Sukumar Pushpa Movie part 2 Anasuya crazy update

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో భారీ ఎత్తున రూపొందించిన ‘పుష్ప’ మూవీకి అంచనాలకు మించిన రెస్పాన్స్ వస్తుండటం పట్ల చిత్రయూనిట్ ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 144.90 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగాడు పుష్పరాజ్. త‌క్కువ స‌మ‌యంలోనే వ‌సూళ్లు సాధించారు.

అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌గా, ఈ సినిమాలో సునీల్, అన‌సూయ పాత్రలు ఎక్కువ నిడివితో ఉంటాయ‌ని సుకుమార్ అంటున్నారు. స్క్రిప్ట్ రెడీగా ఉంది కాబట్టి అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశం ఉంది . పుష్ప ది రైజ్ పేరుతో రెండ‌వ పార్ట్ తెర‌కెక్క‌నుండ‌గా, ఈ సినిమాని అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తామ‌ని అంటున్నారు.

పుష్ప పార్ట్ 2 కు సంబంధించి ఇప్ప‌టికే కొంత షూటింగ్ పూర్త‌య్యింద‌ని సుకుమార్ చెప్పారు. అయితే.. ఇప్పుడు ఆ కంటెంట్ ప‌నికిరాద‌ని ఈ ద‌ర్శ‌కుడు అనుకుంటున్నాడ‌ట‌. దాన్నంతా రీ షూట్ చేయాల్సి ఉంద‌ని కూడా ఈ ద‌ర్శ‌కుడే ప్ర‌క‌టించుకున్నాడు!

మ‌రి త‌ను తీసిన వెర్ష‌న్ ను త‌నే మ‌ళ్లీ రీ షూట్ చేయాల్సి ఉంటుంద‌ని సుకుమార్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి ద‌ర్శ‌కుడు ఇలా అనుకుంటే.. దీని నిర్మాత‌లు, హీరో ఏమంటారో!