Allu Aravind : మెగా ఫ్యామిలీలో అంతకు ముందులా లేదు : అల్లు అరవింద్

NQ Staff - October 6, 2022 / 09:00 AM IST

Allu Aravind : మెగా ఫ్యామిలీలో అంతకు ముందులా లేదు : అల్లు అరవింద్

Allu Aravind : మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ ఆ విషయమై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యే ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా ప్రతి విషయానికి ఫ్యామిలీ అంతా కలిసే పరిస్థితి లేదు.

ఫ్యామిలీ అటు వైపు ఇటువైపు చాలా పెద్దగా అయింది, కనుక ఎప్పుడు కలిసే వీలు ఉండడం లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. అంతే తప్పితే విభేదాలు అస్సలే లేవు.

గతంలో మాదిరిగా కలవనంత మాత్రాన విభేదాలు ఉన్నాయని అనుకోవడం అవివేకం అన్నట్లుగా అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా మెగా మరియు అల్లు ఫ్యామిలీ అంతా కలిసిన విషయం తెలిసిందే.

ముఖ్యమైన సందర్భాల్లో తప్పకుండా అందరం కలుస్తామని, విభేదాలు అనేవి లేవని అల్లు అరవింద్ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడంతో మెగా అభిమానులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి.

చిరంజీవికి అల్లు అరవింద్ తోడు ఉంటే కొండంత బలం అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ నమ్ముతూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ మరియు రాంచరణ్ మధ్య కోల్డ్ వార్ కూడా లేనట్లే అని మెగా ఫాన్స్ ఒక నిర్ణయానికి వచ్చేసారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us