Allari Naresh : రాజకీయాలపై అల్లరి నరేష్ సెన్సేషనల్ కామెంట్స్.!

NQ Staff - November 25, 2022 / 12:32 PM IST

Allari Naresh  : రాజకీయాలపై అల్లరి నరేష్ సెన్సేషనల్ కామెంట్స్.!

Allari Naresh  : ప్రస్తుత రాజకీయాలపై సినీ నటుడు అల్లరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్లరి నరేష్ తాజా సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజకీయాల ప్రస్తావన వస్తే, తనదైన స్టయిల్లో స్పందించాడు.

‘ఇట్లు మారుడుమిల్లి’ ప్రజానీకం సినిమా చూశాక ప్రజల్లో ఎంతో కొంత మార్పు అనేది వస్తుందని అల్లరి నరేష్ చెప్పాడు. ఓటు వేసే జనాలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు.. ఇలా ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం మారాలని చెప్పే సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అని వివరించాడీ అల్లరి హీరో.

రాజకీయాల్లోకి వస్తాడా.?

ఇంతకీ, రాజకీయాల్లోకి వచ్చు ఉద్దేశ్యం అల్లరి నరేష్‌కి ఏమైనా వుందా.? ఇదే విషయమై ప్రశ్నిస్తే, తాను రాజకీయాలకు సరిపడనని కుండబద్దలుగొట్టేశాడు. ‘నేనెంతో సున్నితమైన వ్యక్తిని. నాలాంటివాళ్ళు రాజకీయాలకు పనికిరారు’ అని తేల్చేశాడు అల్లరి నరేష్.

ఇలా ప్రతి ఒక్కరూ ‘మేం సున్నితమైన వ్యక్తులం’ అని చెప్పుకుంటే ఎలా.? సమాజంపై సినిమాల ద్వారానో, ఇంకో మార్గంలోనో కాస్తో కూస్తో ప్రభావం చూపగల పాపులారిటీ వున్న వ్యక్తులు, మంచి రాజకీయాల కోసం ప్రయత్నించాలి. కానీ, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.. అన్నట్లు వ్యవహరిస్తే ఎలా.?

రాజకీయాలు ఛండాలంగా తయారయ్యాయ్.. అన్న భావన అల్లరి నరేష్ మాటల్లో వ్యక్తమవుతోందని అనుకోవాలేమో.!

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us