High Court Serious On Adipurush Director Om Raut : ఆదిపురుష్ డైరెక్టర్ పై హైకోర్టు అసహనం.. ఇలా ఎలా తీస్తావంటూ ఫైర్..!
NQ Staff - June 28, 2023 / 11:27 AM IST

High Court Serious On Adipurush Director Om Raut : మొదటి నుంచి ఆదిపురుష్ చుట్టూ ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. రిలీజ్ కు ముందు నుంచే చాలా విమర్శలు, ట్రోల్సింగ్ వచ్చాయి. ఇక సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయి తీవ్ర విమర్శల పాలు అవుతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి లుక్ బాగా లేదని.. రావణాసురుడిని దారుణంగా చూపించారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
ఈ సినిమాపై ఇప్పటికే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల సినిమాను బ్యాన్ చేయాలంటూ పిటిషన్లు కూడా వేస్తున్నారు. కాగా తాజాగా అలహాబాద్ హైకోర్టు కూడా ఈ సినిమాలోని డైలాగులపై సీరియస్ అయింది. ఆ కోర్టులో వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తూ.. ఆదిపురుష్ డైరెక్టర్, మేకర్స్ పై ఫైర్ అయింది.
ఇవేం డైలాగులు.. ఇలా ఎలా పెడుతారు, మీరు భావి తరాలకు ఏం నేర్పించాలని అనుకుంటున్నారు. గొప్ప రామాయణాన్ని ఇలా తీస్తారా అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేసిది ధర్మాసనం. కాగా తాము ఆదిపురుష్ ను రామాయణం ఇన్ స్పిరేషన్ తో తీసామని, అది నిజమైన రామాయణం కాదంటూ చెప్పినా సరే ధర్మాసనం వినిపించుకోలేదు.
సినిమాలో రాముడు, లక్ష్మణుడు, సీత, రావణాసురుడు, లంక ఇలా అన్నీ చూపించి రామాయణం కాదంటే ఎలా.. అందరినీ బుద్ధిహీనులను చేస్తున్నారా అంట ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. సెన్సార్ బోర్డు అసలు ఎలా పర్మిషన్ ఇచ్చింది అంటూ సీరియస్ అయింది. దాంతో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది.