Alia Bhatt : ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత అలియా భట్ పోస్ట్ చేసిన తొలి ఫొటో ఇదే.. భలే క్యూట్‌గా ఉందిగా..!
NQ Staff - July 2, 2022 / 01:31 PM IST

Alia Bhatt : బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన విషయం తెలిసిందే. సీత పాత్రలో ఈ అమ్మడు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అందాల హీరోయిన్ అలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ 12న బాలీవుడ్ లవ్ బాయ్ రణ్‌బీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ముంబైలోని ఓ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది.

Alia Bhatt Latest Cute Photos
అలియా క్యూట్ లుక్స్..
అయితే అలియా భట్ రీసెంట్‌గా ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ రివీల్ చేసింది. త్వరలో ఆమె తల్లికాబోతున్నట్టు ఫొటోను షేర్ చేసుకుంటూ ప్రకటించింది. దీంతో ఇండస్ట్రీ నుంచి, ఆమె అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రెండు నెలలకే అలియా తల్లి కాబోతున్నట్టు ప్రకటించడంతో అందరు అవాక్కయ్యారు.

Alia Bhatt Latest Cute Photos
అయితే అలియా తన ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత క్యూట్ పిక్ షేర్ చేసింది. ఇందులో అలియా భట్ చాలా క్యూట్‌గా కేక పెట్టించే విధంగా ఉంది. చిన్న చిరు నవ్వు చిందిస్తూ ఆకర్షణీయంగా ఉంది. అలియా భట్ స్టన్నింగ్ లుక్స్‌కి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు.

Alia Bhatt Latest Cute Photos
అలియా భట్ ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆమె నటించిన గంగూభాయ్ కతియావాడి చిత్రం కూడా తెలుగులో విడుదలైంది. అలాగే మరోవైపు ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలోనూ నటించడానికి సిద్దమవుతున్నట్లు ఆ మధ్యలో అలియా తెలియజేశారు.