Alia Bhatt And Ranbir Kapoor :  పాప పేరు రివీల్‌ చేసిన స్టార్ కపుల్‌

NQ Staff - November 25, 2022 / 03:09 PM IST

Alia Bhatt And Ranbir Kapoor  :  పాప పేరు రివీల్‌ చేసిన స్టార్ కపుల్‌

Alia Bhatt And Ranbir Kapoor  : బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్ మరియు రన్బీర్ కపూర్ దంపతులు ఇటీవలే ఆడ బిడ్డ కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ పెళ్లైన రెండు నెలలకి ప్రెగ్నెన్సీ వార్తను అధికారికంగా తెలియజేశారు.

నవంబర్ ఆరవ తారీఖున ఆడ బిడ్డ కు ఆలియా జన్మనివ్వడంతో ఆమె అభిమానులంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ యంగ్ కపుల్ తల్లిదండ్రులు అవ్వడంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆనందంలో మునిగి ఉన్నారు.

ఈ సమయంలో పాపకి ఏం పేరు పెట్టబోతున్నారు అంటూ అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ జంట తమ పాపకి రహ అనే పేరుని పెట్టినట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Alia Bhatt And Ranbir Kapoor Clarified Daughter Name Will Be Raha

Alia Bhatt And Ranbir Kapoor Clarified Daughter Name Will Be Raha

అద్భుతం, ఆనందం, ఆహ్లాదం అనే అర్థం వచ్చే విధంగా ఈ పేరు పెట్టినట్లు ఆలియా పేర్కొంది. రిషి కపూర్ పేరు కలిసి వచ్చే విధంగా పాపకు ఈ పేరు పెట్టి ఉంటారని కొందరు భావిస్తున్నారు. మొత్తానికి ఆలియా భట్ కూతురి పేరు రహ అని క్లారిటీ వచ్చేసింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us