Akkineni Nagarjuna : ఇప్పటికైనా నాగార్జున స్పందించకుంటే వారు కూడా ఊరుకోరు
NQ Staff - January 26, 2023 / 07:12 PM IST

Akkineni Nagarjuna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ ఎస్వీ రంగారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ విమర్శలు మొదలయ్యాయి.
బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేదా అనే విషయం పక్కన పెట్టి చాలా మంది ఆయన మాటలు తమను బాధపెట్టాయి అంటూ విమర్శించడం మొదలు పెట్టారు. అక్కినేని ఫ్యామిలీ ఏకంగా ప్రెస్ నోట్ విడుదల చేసి మరి నాగేశ్వరరావు వ్యాఖ్యలపై బాలకృష్ణకు కౌంటర్ ఇవ్వడం జరిగింది.
ఈ సమయంలో బాలకృష్ణ తన వ్యాఖ్యలపై స్పందించాడు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కాదంటూ పేర్కొన్నాడు, అదే సమయంలో తనకు అక్కినేని నాగేశ్వరరావుకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
నేను బాబాయి అంటూ ఆప్యాయంగా పిలుస్తానని, ఆయన కూడా ఆయన సొంత కొడుకులతో కంటే నాతో ఎక్కువ ఆప్యాయంగా ఉండే వారిని బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆప్యాయత లభించని కారణంగా నాతో ఆప్యాయంగా ఉండేవారని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని అవమానించే విధంగా ఉన్నాయి.
మొన్న బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగార్జున స్పందించలేదు, ఈసారి బాలకృష్ణ వ్యాఖ్యలు శృతి మించినట్లుగా ఉన్నాయి. అందుకే కచ్చితంగా నాగార్జున స్పందించాల్సిందే అంటూ అక్కినేని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి బాలకృష్ణ తాజా వ్యాఖ్యలపై నాగార్జున స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.