Raviteja Ravanasura : ర‌వితేజ రావ‌ణాసుర నుండి స‌ర్‌ప్రైజ్‌.. కీల‌క పాత్ర‌లో అక్కినేని ఫ్యామిలీ హీరో

Raviteja Ravanasura : క్రాక్ హిట్‌తో మాస్ మ‌హ‌రాజా మంచి ఫామ్‌లో ఉన్నాడు. చివ‌రిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే సినిమాను మొదలు పెట్టాడు. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్ మాత్రం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. అయినప్పటికీ చిత్ర యూనిట్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Akkineni Hero Sushanth in Raviteja Ravanasura movie
Akkineni Hero Sushanth in Raviteja Ravanasura movie

శ‌రత్ మందవతో రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తోన్నాడు. ఈ మూవీ మార్చి 25న విడుదల కాబోతుంది.

వీటితో పాటు ఈ మాస్ హీరో త్రినాథరావు నక్కినతో రవితేజ ‘ధమాకా’ అనే సినిమాను కూడా ప్రకటించాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.ఇక టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించబోతున్న రావ‌ణాసుర‌ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా జరుపుకోబోతుంది.

ఈ సినిమా నుంచి తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఇందులో రవితేజ లాయర్‌గా నటించబోతున్నాడట. ఇందులో భాగంగానే ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్న దక్ష నాగర్కర్ ఆట కట్టించేందుకు పావులు కదుపుతాడని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందనుందన్న విషయం అర్థం అవుతోంది.

ర‌వితేజ‌లో అక్కినేని సుశాంత్ రామ్ అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తాజాగా ప్ర‌క‌టించారు. డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో స్ట‌న్నింగ్ లుక్‌తో క‌నిపిస్తున్న సుశాంత్ ఈ సినిమాతో మంచి పేరు అందిపుచ్చుకుంటాడ‌ని భావిస్తున్నారు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలోను సుశాంత్ కీల‌క రోల్‌లో న‌టించి మెప్పించిన విష‌యం తెలిసిందే.