Ajay Devgn : పార్టీలో మందు గ్లాస్‌తో నానా రచ్చ చేసిన స్టార్ హీరో తనయ.. అవాక్కవుతున్న నెటిజన్స్
NQ Staff - May 5, 2022 / 08:11 PM IST

Ajay Devgn : ఇటీవలి కాలంలో సెలబ్రిటీలతో పాటు వారి పిల్లలకు మందు, పబ్‌లు, పార్టీలు అనేవి కామన్‌గా మారాయి. ఒకప్పడు కనీసం సీక్రెట్‌గా ఉండేవి. ఇప్పుడలా కాదు పార్టీలలో పీకలదాకా తాగుతూ ఆ సమయంలో ఎంచక్కా ఫొటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా అజయ్ దేవగణ్ కుమార్తె తన ఫ్రెండ్స్ తో కలిపి పార్టీ చేసుకుంది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Ajay Devgn’s daughter nysa night party
అజయ్ దేవగన్, కాజోల్ కూతురు నైసా దేవగన్ పార్టీ లలో మునిగితేలుతోంది. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20న 19 ఏళ్లు నిండిన సందర్భంగా నైసా దేవగన్ తన స్నేహితురాళ్లతో కలిసి పార్టీలు చేసుకుంటూ క్లిక్ మనిపించింది. నైసా తన స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలు మరియు ఆమె యొక్క ఇతర అదిరిపోయే ఫొటోలు గత రెండు రోజులుగా వైరల్ కావడం ప్రారంభించాయి.
నైసా వీటన్నింటిలో చాలా అందంగా కనిపించింది మరియు ఆమె త్వరలో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నట్లు రూమర్స్ ఉన్నాయి.ఈ ఫొటోలలో, నైసా దేవగన్ తన బెస్ట్ బడ్డీ ఓర్హాన్ , ఇతర ప్రెండ్స్ తో కలిసి లండన్‌లో పార్టీ చేసుకుంటూ కనిపించింది. అందులో ఒక ఫోటోకు, జాన్వీ కపూర్ రిప్లై ఇచ్చింది. పార్టీ ఫోటోలలో నైసా దేవగన్‌తో పాటు అర్జున్ రాంపాల్ కుమార్తె మహికా రాంపాల్ కూడా కనిపిస్తుంది.

Ajay Devgn’s daughter nysa night party
నైసా దేవగన్ గతంలో తన స్కూల్ పోగ్రామ్ లో గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలో కాజోల్ సూపర్ హిట్ పాటలను ప్రదర్శించింది. కాజోల్ హిట్ మూవీ కబీ ఖుషి కబీ ఘమ్ నుండి బోలే చుడియాన్ సాంగ్ ని ఎంపిక చేసుకోవడం ఆసక్తికరం. ప్రస్తుతం వీరి కూతురు, స్టార్ కిడ్ నైసా దేవ్ గణ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టార్ కిడ్ అయ్యి ఉండి కూడా పలు పార్టీలకు అటెండ్ అవుతూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తోంది.
ఆ మధ్యన బాలీవుడ్ ఫిల్మ్ ఛానల్ కు ఇచ్చిన కొత్త ఇంటర్వ్యూలో, నైసా యొక్క బాలీవుడ్ అరంగేట్రం గురించి అజయ్‌ని అడిగినప్పుడు, “ఆమె ఈ లైన్‌లోకి రావాలని కోరుకుంటుందో లేదో నాకు తెలియదు. ఈ క్షణం వరకు ఆమె నిరాసక్తతను ప్రదర్శించింది. పిల్లలతో ఎప్పుడైనా ఏదైనా మారవచ్చు అన్నారు.
నైసా ప్రస్తుతంవిదేశాల్లో ఉంది, చదువుతోంది. స్విట్జర్లాండ్‌లోని గ్లియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ చదువుతోంది. అంతకుముందు, ఆమె పాఠశాల చివరి సంవత్సరాలలో మూడు సంవత్సరాలు సింగపూర్‌లో ఉంది. గత నెలలో, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో నైసా చిత్రాన్ని పంచుకున్నారు. ఫోటోలో, నైసా మనీష్ కలెక్షన్ నుండి దుస్తులు ధరించి కనిపించింది.