Aishwarya Wedding Update News : త్వరలో హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి.. వరుడు అతనే..!

NQ Staff - June 26, 2023 / 09:36 AM IST

Aishwarya Wedding Update News : త్వరలో హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి.. వరుడు అతనే..!

Aishwarya Wedding Update News : యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. దాదాపు ముప్పై ఏండ్లుగా ఆయన సినిమాల్లో పని చేస్తున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఆయన.

కాగా ఆయన కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా బాగానే సినిమాలు చేస్తోంది. తమిళంలో ఇప్పటికే చాలా సినిమాలు చేసింది. కాగా త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. తమిళ కమెడియన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఆమె పెళ్లి జరగబోతున్న ప్రచారం జరుగుతోంది.

ఉమాపతితో ఆమె కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు సమచారం. అందుకే వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. ఉమాపతి 2017లో సినీ ఎంట్రీ ఇచ్చారు. వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. బుల్లితెరపై కూడా ఆయన ఎన్నో షోలు చేశాడు. ఆర్థికంగా బాగానే సెటిల్ అయ్యారు.

Aishwarya Is Getting Married Umapathy Ramaiah

Aishwarya Is Getting Married Umapathy Ramaiah

అందుకే వీరి పెళ్లికి అర్జున్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. ఐశ్వర్య రీసెంట్ గా తెలుతులోకి కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ మిస్ అయింది. విశ్వక్ సేన్ తో ఆమె సినిమాలో నటించే అవకాశం ఉన్నా.. కొద్దిలో సినిమా క్యాన్సిల్ అయిన విషయం మనకు తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us