Aha OTT : త‌మిళంలోను లాంచ్ కానున్న ఆహా.. అర‌వింద్ ప్లాన్స్ మాములుగా లేవు..!

Aha OTT : అల్లు అర‌వింద్.. ఈయ‌న టాలీవుడ్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. తెలుగు సినిమా రంగంలో నిర్మాతగా అల్లు అరవింద్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఓ చిత్రాన్ని ఏ బడ్జెట్ లో నిర్మించవచ్చు, దానిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళ వచ్చు. అన్న అంశాలలో ఆయన రూపొందించేలా ఎవరూ ప్రణాళికలు అల్లలేరని ప్రతీతి. చిరంజీవిని ‘మెగాస్టార్’గా నిలపడంలోనూ అల్లు అరవింద్ కృషి ఉంది.

Aha OTT going to tamil film industry
Aha OTT going to tamil film industry

ఇక తెలుగులో ఆహా పేరుతో ఓటీటీని లాంచ్ చేశారు. దీని కోసం ఆయ‌న వేసే ప్ర‌ణాళిక‌లు మాములుగా లేవు. ‘ఆహా’ ఓటీటీని సక్సెస్ రూటులో సాగేలా చేస్తున్నారు. అందులో భాగంగా ఏ నాడూ టాక్ షో చేయని నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘ఆహా’ అనిపించేలా ‘అన్ స్టాపబుల్’ షో చేయిస్తున్నారు. దీనిని బట్టే అల్లు అరవింద్ మేధస్సులోని పవర్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఓ వైపు చిత్ర నిర్మాణం, మరోవైపు ‘ఆహా’ నిర్వహణ, తనయులు, బంధువుల చిత్రాల ప్లానింగ్ అన్నిటా అరవింద్ ఏదో విధంగా పాలుపంచుకుంటూ బిజీ బిజీగానే సాగుతున్నారు. అందుకే అలుపెరుగని అరవింద్ ను చూసి సినీజనం ‘ఆహా’ అంటున్నారు. ‘ఆహా 2.0’ ఓటీటీ వెర్షన్‌ను త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లో ఆహ త‌మిళ్ కూడా లాంచ్ చేయాల‌నుకుంటున్నార‌ట అర‌వింద్. పుష్ప సినిమాతో బన్నీ త‌మిళ ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర కాగా, త‌న‌యుడితో ప్ర‌మోష‌న్స్ చేయించి ఆహా త‌మిళ్‌పై మ‌రింత క్రేజ్ వ‌చ్చేలా చేయాల‌నుకుంటున్నాడ‌ట అర‌వింద్. అర‌వింద్ త‌న అద్భుత‌మైన ఆలోచ‌న‌ల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ వావ్ అనిపిస్తున్నాడు.

తెలుగు బేస్‌తో ప్రారంభ‌మైన ఓటీటీ ఆహా .. ప‌లు చిత్రాల‌ను, వెబ్ సిరీస్ ల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తుంది. ఇత‌ర భాష‌ల్లో సినిమాల‌ను కూడా డ‌బ్ చేసి అందిస్తుంది. కాస్సెప్ట్ బేస్డ్‌ మూవీల‌ను డ‌బ్ చేసి తెలుగు ఆడియ‌న్స్ కు ఆహా ప‌రిచ‌యం చేయ‌గా, తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఈ మూవీస్‌పై ఆస‌క్తి క‌న‌బ‌ర్చారు.