Shivaji Ganesan : శివాజీ గణేషన్ కుటుంబంలో ఆస్తి తగాదాలు.. మోసం చేశారంటూ నటుడు ప్రభుపై ఆరోపణలు
NQ Staff - July 8, 2022 / 12:27 PM IST

దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించాడు. అయితే ఆయన మరణించిన రెండు దశాబ్దాల తర్వాత కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తన తండ్రి ఆస్తిలో తనకు వాటా ఇవ్వలేదంటూ నటుడు ప్రభు, నటుడు, నిర్మాత రామ్‌కుమార్ లపై తోబుట్టువులు శాంతి, రాజ్వీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
లుకలుకలు..
శివాజీ గణేశన్ తరువాత ఆయన ఫ్యామిలీ నుంచి ప్రభు హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డాడు. ఆయన పెద్ద కొడుకు రామ్ కుమార్ నిర్మాతగా మారారు. శివాజీ గణేశన్ మరణం అనంతరం ఆయన వారసత్వం నిలబడుతుంద అనుకున్న టైమ్ లో కుటుంబంలో ఆస్తి చిచ్చు రేగింది.

After Death Shivaji Ganesan Property Boom Broke out
శివాజీ గణేశన్ మరణించిన రెండు దశాబ్దాల తర్వాత ఆస్తి చిచ్చు రేగింది. తన తండ్రి ఆస్తిలో తనకు వాటా ఇవ్వలేదంటూ..శివాజీ కూతుర్లు కోర్టుకెక్కారు. నటుడు ప్రభు, నటుడు, నిర్మాత రామ్‌కుమార్ లపై తోబుట్టువులు శాంతి, రాజ్వీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తి విషయంలో తమకు అన్యాయం చేశారంటూ.. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తండ్రి మరణం తర్వాత రూ. 271 కోట్ల ఆస్తిని సరిగా పంచలేదని, తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వారు పేర్కొన్నారు. తమకు తెలియకుండానే ఆస్తులను విక్రయించేశారని, అది చెల్లదని ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు. వెయ్యి సవర్ల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను సోదరులు ప్రభు, రామ్‌కుమార్ అపహరించారని ఆరోపించారు.

After Death Shivaji Ganesan Property Boom Broke out
శాంతి థియేటర్‌లో ఉన్న 82 కోట్ల విలువైన వాటాలను వారు తమ పేరున మార్చుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ తండ్రి రాసినట్టు చెబుతున్న వీలునామా నకిలీదని పేర్కొన్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారని ఆరోపించారు. ఈ కేసులో ప్రభు, రామ్‌కుమార్‌ల కుమారులు విక్రమ్ ప్రభు, దుష్యంత్‌లను కూడా ప్రతివాదులుగా ఇందులో చేర్చారు. మరి ఈ కేసు ఎంత దూరం వరకు వెళుతుందో చూడాలి.